పంజాబ్ పోలీసులు బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (బీకేఐ)కి చెందిన ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రెండు పిస్టల్స్, నాలుగు మ్యాగజైన్లు, 30 కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై యూఏపీఏ, ఆయుధ చట్టం కింద అమృత్‌సర్‌లోని రాష్ట్ర స్పెషల్ ఆపరేషన్ సెల్‌లో కేసు నమోదు చేశారు.
అమెరికాకు చెందిన హర్‌ప్రీత్ సింగ్ అలియాస్ హ్యాపీ పసియాన్, ఉగ్రవాది హర్విందర్ సింగ్ అలియాస్ రిండా, అర్మేనియాకు చెందిన షంషేర్ సింగ్ అలియాస్ షేరాలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం హ్యాపీ పసియాన్, రిండా, షంషేర్‌లు పంజాబ్‌లోని యువతను దేశ వ్యతిరేక కార్యకలాపాల దిశగా పేరేపిస్తున్నారు. హర్‌ప్రీత్ సింగ్, హర్విందర్ సింగ్‌లను పోలీసులు అరెస్టు చేశారు.