Friday, November 22, 2024

కునో పార్క్‌లో మ‌ర‌నించిన మరో రెండు చిరుత పిల్లలు

మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో ఇవ్వాల తీవ్ర వాతావరణ పరిస్థితులు, డీహైడ్రేషన్ కారణంగా మరో రెండు చిరుత పిల్లలు మరణించాయి. ఇటీవల జన్మించిన నాలుగు చిరుత పిల్లల్లో రెండు రోజుల్లో మూడు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. మార్చి నెల‌లో కునో జాతీయ పార్కులో ‘జ్వాల’ అనే ఆడ చిరుత నాలుగు చిరుత పిల్లలకు జన్మనిచ్చింది. మంగళవారం, రెండు నెలల చిరుత అపారమైన బలహీనత కారణంగా మరణించిందని అధికారులు తెలిపారు. అయితే దురదృష్టవశాత్తు ఈరోజు మరో రెండు చిరుత పిల్లలు మరణించాయని అధికారులు తెలిపారు.

ఇక‌ నాల్గవ పిల్లను పాల్పూర్‌లోని ఆసుపత్రికి తరలించామని, తదుపరి చికిత్స కోసం అధికారులు నమీబియా, దక్షిణాఫ్రికా నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారని అధికారులు తెలిపారు. గతవారం సుప్రీంకోర్టు కూడా రెండు నెలల్లోపు మూడు చిరుతలు చనిపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. దక్షిణాఫ్రికా, నమీబియా నుండి మధ్యప్రదేశ్‌కు తరలించబడిన చిరుతలను పొరుగున ఉన్న రాజస్థాన్‌కు తరలించాలని కోర్టు సూచించింది. మార్చి 27న, సాషా అనే ఆడ చిరుత కిడ్నీ వ్యాధి కారణంగా మరణించింది. ఏప్రిల్ 23న, ఉదయ్ అనే చిరుత‌ కార్డియో-పల్మనరీ ఫెయిల్యూర్‌తో మరణించింది. మే 9న, దక్ష అనే మరో ఆడ చిరుత సంభోగ ప్రయత్నంలో మగ చిరుత హింసాత్మక పరస్పర చర్య కారణంగా మరణించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement