హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాజధాని హైదరాబాద్‌లోని మూసారాంబాగ్, చాదర్ ఘాట్‌లలో మూసీనది పై నూతన బ్రిడ్జిలను నిర్మించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఇటీవల మూసీనది వరద ఉదతికి దెబ్బతిన్న మూసారాంబాగ్ బ్రిడ్జ్‌ని శుక్రవారం మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, వాటర్ వర్క్స్ దాన కిషోర్ లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కొత్తగా మంజురైన బ్రిడ్జి నిర్మాణాలను 10 రోజుల్లో ప్రారంభిస్తామని చెప్పారు.
భారీ వర్షాలు కురిసి ఊహంచని విధంగా మూసీ నదికి వరదలు రావడం వలన ముసరాం బాగ్ వంతెన, పటేల్ నగర్, గోల్నాక తదితర పరిసర ప్రాంతాలు ముంపుకు గురై ఇండ్లలోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడాల్సి వచ్చిందని వివరించారు. తద్వారా ఈ వంతెన పై నుండి రాకపోకలను నిలిపివేయాల్సి వచ్చిందని చెప్పారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రత్యెక చొరవతో ప్రభుత్వం ముసరాం బాగ్ వంతెన నిర్మాణం కోసం 52 కోట్లు, చాదర్ ఘాట్ వంతెన కోసం కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందని వివరించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.