Tuesday, November 12, 2024

కవల పిల్లల ప్రాణాలు తీసిన ఆక్సిజన్ కొరత

దేశంలో ఆక్సిజన్‌ సంక్షోభం కొనసాగుతోంది. ఆక్సిజన్‌ అందక నిత్యం పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా యూపీలోని బారాబంకిలోని ఓ ఆస్పత్రిలో ప్రాణవాయువు అందక ఇద్దరు నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు. బారాబంకిలో స్థానికంగా రెండు పిల్లల దవాఖానాలు ఉన్నాయి. వాటికి ఆక్సిజన్‌ సరఫరా చేయలేనందున గత రాత్రి జన్మించిన ఇద్దరు కవలలు కన్నుమూశారు. ఆక్సిజన్‌ సరఫరాలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికార వర్గాలు తెలిపాయి.

మరో వైపు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ స్పందిస్తూ రాష్ట్రంలో ప్రైవేట్‌, ప్రభుత్వ దవాఖానల్లో ఆక్సిజన్‌ కొరత లేదని ప్రకటించారు. ఆక్సిజన్‌ సరఫరాపై సరైన పర్యవేక్షణ కోసం ఐఐటీ కాన్పూర్‌, ఐఐఎం లక్నో, ఐఐటీ బీహెచ్‌యూల ఆధ్వర్యంలో ఆక్సిజన్‌ ఆడిట్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆక్సిజన్‌ డిమాండ్‌, సరఫరా, పంపిణీకి ప్రత్యక్ష ట్రాకింగ్‌ వ్యవస్థ అమలు చేపడుతున్నట్లు సీఎం యోగి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement