హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఓయూ పరిధిలో ఇంజనీరింగ్ విద్యలో మరో రెండు కొత్త కోర్సులు వచ్చి చేరాయి. మైనింగ్ ఇంజనీరింగ్‌తోపాటు ఆర్టిఫిషల్ ఇంటలీజెన్స్, అండ్ మెషిన్ లెర్నింగ్ కోర్సులకు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) న్యూ ఢిల్లి అనుమతిని ఇచ్చింది. పీజీ స్థాయిలో మైనింగ్ ఇంజనీరింగ్ కోర్సుకు కూడా అనుమతి వచ్చింది.
ఈ కోర్సులను ఉస్మానియా యూనివర్సిటీలో అందించనున్నట్లు వీసీ డా. రవీంద్ర యాదవ్ తెలిపారు. ఇంజనీరింగ్ విద్య బీఈలో సీట్ల సంఖ్యను 50 నుంచి 60కి పెంచినట్లు ఓయూ ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ ప్రొ. శ్రీరాం వెంకటేష్ తెలిపారు. మరో 6 యూజీ, 18 పీజీ కోర్సులకు ఎక్స్ టెన్షన్ అనుమతి కూడా లభించినట్లు ఆయన పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.