Saturday, November 23, 2024

Followup : మరో రెండు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు, రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : మధ్య బంగాళాఖాతంలో ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల వెంబడి అల్పపీడనం ఏర్పడింది. రానున్న 48 గంటల్లో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ఈ ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒడిశా- ఉత్తరాంధ్ర తీరాల వెంట అల్పపీడనం ఏర్పడింది. రెండు రోజుల్లో ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

ఆ తర్వాత ఇది ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ మీదుగా క్రమంగా పశ్చిమ – వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని వివరించింది. దీని ప్రభావంతో ఏపీలోని ఉత్తరాంధ్రలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వచ్చే రెండు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మంగళవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement