దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుండటంతో చాలా రాష్ట్రాల్లో నిబంధనలను సడలిస్తున్నారు. అన్‌లాక్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. మరోవైపు వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రయను వేగ వంతం చేస్తున్నారు. అంతేకాదు, జూన్ 21 వ తేదీ నుంచి దేశంలో 18 ఏళ్లు నిండిన ఆందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందించేందుకు కేంద్రం సిద్దమైంది. వ్యాక్సినేషన్‌తో పాటు కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కనీసం రెండు నెలలపాటు నిబంధనలు పాటించాలని, అప్పుడే కరోనా వేవ్‌లు రాకుండా ఉంటాయని, కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. అన్‌లాక్ అమలు చేసిన తరువాత సమూహాలుగా ఏర్పడవద్దని, ప్రజు సంయమనం పాటించాలని కేంద్రం తెలియజేసింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement