చత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో బుధవారం ఉదయం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. ఘటన స్థలం నుంచి భద్రత బలగాలు.. ఇద్దరి నక్సలైట్ల మృతదేహాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు అరగంట పాటు జవాన్లు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి. దంతెవాడ జిల్లాలోని కాకడి, నహాది అడవుల్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు తలదాచుకున్నారనే సమాచారం రావడంతో భద్రత బలగాలు రంగంలోకి దిగాయి. మంగళవారం రాత్రి ఆపరేషన్‌ను ప్రారంభించాయి. భద్రత బలగాల బృందం బుధవారం ఉదయం కాకడి-నహరి అటవీప్రాంతానికి చేరుకోగా.. అక్కడ మావోయిస్టుల ఉనికిని గుర్తించారు. ఈ క్రమంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు కాల్పులు ప్రారంభమయ్యాయి.
దాదాపు అరగంట పాటు ఇరువర్గాల మధ్య ఎన్‌కౌంటర్ సాగింది. అయితే దట్టమైన అడవిని ఆసరాగా చేసుకుని పలువురు మావోయిస్టులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్టుగా పోలీసు వర్గాలు తెలిపాయి