వరంగల్ : సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు మావోయిస్టులతో పాటు మరో ముగ్గురు సానుభూతిపరులను టాస్క్ ఫోర్స్ , హనుమకొండ పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన మావోయిస్టుల నుండి పోలీసులు 50 జిలిటెన్ స్టిక్స్, 50 డిటనేటర్లు, 74 వేల రూపాయల నగదు, విప్లవ సాహిత్యం, ఒక బోలెరో కారు, సెల్ ఫోన్లు, అధార్, ఎన్నికల గుర్తింపు కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో
- మడకం ఉంగి అలియాస్ కమల, (దండకారుణ్య సౌత్ సబ్ జోన్ డాక్టర్స్ టీం కమాండర్) ముంతమడుగు గ్రామం, పామెడు తాలుకా, బీజాపూర్ జిల్లా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం.
- అసం సోహెన్ (మావోయిస్టు పార్టీ దళ సభ్యుడు, నేషనల్ ఏరియా), కండ్లపర్తి గ్రామం, భూపాల్ పట్నం తాలూకా, బీజాపూర్ జిల్లా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం .
- మీచ అనిత ( క్రాంతికారి ఆదివాసి మహిళ సంఘ్ అధ్యక్షురాలు, మవోయిస్టు పార్టీ అనుబంధ సంస్థ), కండ్లపర్తి గ్రామం, భూపాలపట్నం తాలూకా, బీజాపూర్ జిల్లా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం.
4.గొడ్డి గోపాల్, (ఆర్.పి.సి అధ్యక్షుడు) వరదల్లి గ్రామం, బీజాపూర్ జిల్లా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం. - కందగుర్ల సత్యం, నల్లంపల్లి, భూపాల్ పట్నం తాలూకా, బీపూర్ జిల్లా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం.
ఈ అరెస్టుకు సంబందించి సెంట్రల్ జోన్ డిసిపి అశోక్ కుమార్ వివరాలను వెల్లడిస్తూ విశ్వసనీయ సమచారం మేరకు నగరంలో మావోయిస్టుల కదలికలు ఉన్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసు అధికారుల ఉత్తర్వుల మేరకు నిన్నటి రోజు సాయంత్రం సమయంలో ములుగు రోడ్డు ప్రాంతంలో ఆజర హస్పటల్ ప్రాంతంలో వాహన తనిఖీలు నిర్వహించారు. అనుమానస్పదంగా వస్తున్న బోలేరో వాహనాన్ని పోలీసులు తనిఖీ చేయగా కారులో పేలుడు పదార్థాలు, మావోయిస్టు పార్టీకి సంబంధించిన సాహిత్యాన్ని గుర్తించడం జరిగింది. పోలీసులు తక్షణమే కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు, డ్రైవర్ తో సహ మరో ముగ్గురు వ్యక్తులను పోలీసులు విచారించగా పట్టుబడిన వ్యక్తులు నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన సభ్యులు, సానుభూతి పరులుగా పోలీసులు గుర్తించడం జరిగింది. మావోయిస్టులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన టాస్క్ ఫోర్స్ డిసిపి వైభవ్ గైక్వాడ్, ఏసిపి జితేందర్ రెడ్డి, హనుమకొండ ఏసిపి కిరణ్ కుమార్ టాస్క్ ఫోర్స్, హనుమకొండ ఇనన్స్ స్పెక్టర్లు సురేష్ కుమార్, శ్రీనివాజీ, టాస్క్ ఫోర్స్ , హనుమకొండ ఎస్.ఐలు లవణ్ కుమార్,నిసార్ పాషా, రాజు, ఉమ, టాస్క్ ఫోర్స్ హెడ్ కానిస్టేబుళ్లు శ్యాం సుందర్, సోమలింగం, మాధవరెడ్డి, అశోక్, స్వర్ణలత, కానిస్టేబుళ్లు నవీన్, శృజన్, శ్రవణ్ కుమార్, నాగరాజు, రాజు, సురేష్, శ్యాం సుందర్, శ్రీధర్, శ్రీనులను సెంట్రల్ డిసిపి అభినందించారు.