Monday, November 18, 2024

మగబిడ్డకు రెండు లక్షలు బేరం

నల్లమల అడవి ప్రాంతంలో గిరిజనులకు రక్షణ లేకుండా పోయింది ఇటీవలె చెంచు గూడెంలో కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది వీరికి ముగ్గురు సంతానం ఉండగా అందులో ఒకరు మగ బిడ్డ గా జన్మించారు. ఇటీవలనే కొంతమంది దళారులు వారి కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లి వారికి మాయమాటలు చెప్పి బాలుడి విక్రయించడానికి ప్రయత్నం చేశారు కానీ ఆ చెంచు గిరిజనులు ఒప్పుకోకపోవడంతో వారిని కొట్టిన సంఘటనలున్నాయి. ఈ విషయం గురువారం రాత్రి బయటికి రావడంతో పోలీసులు చెంచులను, మధ్యవర్తులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఇరువురికి కౌన్సిలింగ్ ఇచ్చారు.

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం మొల్ల చింతపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని మెదరోని బండ పెంటలో చెంచు బయన్న కుటుంబం జీవనం సాగిస్తున్నారు. ఈయనకు ఇద్దరు భార్యలు మొదటి భార్య బక్కమ్మ కు సంతానం లేరు. రెండోవ భార్య బాలమ్మ కు ముగ్గురు పిల్లలు ఉన్నారు. అందులో ఇటీవల మగ సంతానం కలిగింది. బాబును తండ్రి బయన్న మధ్యవర్తులు ముక్కిడిగుండం కు చెందిన నాను, బాలయ్యతో మాట్లాడి పెద్దకొత్తపల్లి మండలం సాతపూర్ గ్రామానికి చెందిన వారికి రూ. 2 లక్షలకు బాబు విక్రయించాడానికి చూసారు. కానీ తతంగం బయటకు పోకడంతో బాబును తల్లిదండ్రుల వద్దనే వదిలివెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. శుక్రవారం ఐ సీడీఎస్ సీడీపీఓ లు చెంచు పెంటకు చేరుకున్న వారు తల్లిదండ్రులకు అవగాహన చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement