పశ్చిమ బెంగాల్‌లోని బంకురాలోని ఓండాలో ఆదివారం తెల్లవారుజామున రెండు గూడ్స్ రైళ్లు ఢీకొనడంతో రైలు ప్రమాదం జరిగింది. దీని తర్వాత 12 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ప్లాట్‌ఫారమ్, సిగ్నల్ రూం ధ్వంసం కాగా డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.
ఇందులో రెండు సరుకు రవాణా రైళ్లకు చెందిన ఒక ఇంజన్ సహా 12 బోగీలు పట్టాలు తప్పాయి.తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనతో అద్రా-ఖరగ్‌పూర్ బ్రాంచ్‌లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. స్థానిక సమాచారం ప్రకారం.. ఓడా రైల్వే స్టేషన్ సమీపంలోని లూప్ లైన్‌పై నిలబడి ఉన్న గూడ్స్ రైలు వెనుక బంకురా నుండి వస్తున్న మరో గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఒక ఇంజన్‌తో పాటు రెండు గూడ్స్ రైలులోని 12 కోచ్‌లు పట్టాలు తప్పాయి. స్థానికులు డ్రైవర్లను కాపాడారు. రెండు సరుకు రవాణా రైళ్లు ఒకే లైన్‌పై ఎలా వచ్చాయని ప్రశ్న తలెత్తుతోంది