ఎదురెదురుగా వస్తున్న రెండు గూడ్స్ రైళ్లు ఢీ కొన్న ఘటనలో ఇద్దరు లోకో పైలట్ లకు తీవ్ర గాయాలైన ఘటన పంజాబ్ రాష్ట్రం సిర్హింద్ జిల్లాలోని మాధోపూర్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో ఆ రైళ్ల బోగీలు కొన్ని బోల్తాపడ్డాయి. మరికొన్ని బోగీలు ఒకదానిపైకి ఒకటి ఎక్కాయి. రైళ్లలో ఉన్న ఇద్దరు లోకో పైలట్ లకు తీవ్ర గాయాలు కాగా.. శ్రీ ఫతేగఢ్ సాహిబ్ సివిల్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement