Sunday, November 24, 2024

వీడియో: బాయ్‌ఫ్రెండ్ కోసం కొట్టుకున్న ఇద్దరు యువతులు

సాధారణంగా గర్ల్ ఫ్రెండ్ కోసం అబ్బాయిలు కొట్టుకుంటుంటారు. కానీ తాజాగా ఓ బాయ్ ఫ్రెండ్ కోసం ఇద్దరు అమ్మాయిలు కొట్టుకున్నారు. అది కూడా మామాలుగా కాదు.. ఒకరి జుట్టు ఒకరు పట్టుకొని లాగేసుకున్నారు. కిందపడి బొర్లారు. తన్నుకున్నారు. నడిరోడ్డు మీద చాలా సేపు అరుస్తూ వాళ్ల కొట్టుకుంటున్న సీన్ చూసి జనం షాక్ అయ్యారు. జార్ఖండ్‌లోని సరాయకేలాలో ఈ ఘటన జరిగింది. బుధవారం సాయంత్రం ఇద్దరు యువతులు నడిరోడ్డు మీదే గొడవకు దిగారు. ముందు ఏమైందో అమ్మాయిలు ఎందుకు కొట్టుకుంటున్నారో అనుకొని చాలా మంది వాళ్లను ఆపేందుకు ప్రయత్నించారు. ఐతే వాళ్లు కొట్టుకుంది ఒక బాయ్ ఫ్రెండ్ కోసమని తెలిసి వామ్మో అనుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయితే ఈ వీడియోను సోషల్ మీడియాలో చూసిన వారు మాత్రం చాలా ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ఆ బాయ్ ఫ్రెండ్‌ను ఏం లక్ రా బాబు నీది అంటున్నారు. ఒక్క అమ్మాయి లేక మేము బాధపడుతుంటే ఇద్దరిని ఎలా పడేశావ్ రోయ్ అంటూ సింగిల్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఉండటమే గొప్ప అయితే నడిరోడ్డుపై నీ కోసం వాళ్లు కొట్టుకున్నారు చూడు అంతకన్నా నీ జన్మకు ఏం కావాలేరా బాబు అంటూ ఇంకొంత మంది కామెంట్స్ చేస్తున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement