అమెరికాలోని డెన్వర్ లో రెండు చిన్న విమానాలు ఆకాశంలో ఢీకొట్టుకున్నాయి. అందులో కీ లైమ్ ఎయిర్ మెట్రోలైనర్ కు చెందిన విమానం దాదాపు సగానికి తెగింది. అయితే అదృష్టవశాత్తూ రెండు విమానాలు సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి. సమీపంలోని సెంటెనియల్ ఎయిర్ పోర్ట్ లో సురక్షితంగా ల్యాండ్ అయింది. అందులోని ఒక ప్రయాణికుడూ సురక్షితంగా ఉన్నాడు. సిర్రస్ ఎస్ఆర్ 22 అనే మరో విమానం పారాచూట్ సాయంతో పక్కన పొలాల్లో దిగింది. అందులోని ఇద్దరు ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. అయితే, ప్రమాదానికి ఏ విమానం కారణమైందన్నది మాత్రం తెలియలేదని అధికారులు చెబుతున్నారు. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని నేషనల్ ట్రాన్స్ పోర్టేషన్ సేఫ్టీ బోర్డు ప్రకటించింది. విమాన శకలాలు చాలా దూరం వరకూ పడ్డాయని, వాటిని ఎవరూ తాకొద్దని, వెంటనే అధికారులకు సమాచారమివ్వాలని సూచించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement