హైదరాబాద్, ప్రభన్యూస్ : ఏకకాలంలో రెండు డిగ్రీలను దేశ, విదేశీ విద్యాసంస్థల నుంచి చేసుకునే అవకాశాన్ని యూజీసీ కల్పిస్తోంది. ఒకే యూనివర్శిటీ నుంచి లేదా వేర్వేరు యూనివర్శిటీల నుంచి ఒకేసారి రెండు డిగ్రీలు చేయడానికి ఇటీవలే యూజీసీ అనుమతించింది. అయితే ప్రస్తుతం ఆ డ్యూయల్ డిగ్రీ కోర్సులు సహా ట్విన్నింగ్ ప్రోగ్రాంలను భారతీయ, విదేశీ ఉన్నత విద్యా సంస్థలు కలిసి అందించేందుకు పచ్చజెండా ఊపినట్లు ప్రకటించింది. అతి త్వరలోనే ఈ విధానం అమల్లోకి వస్తుందని మంగళవారం జరిగిన ఉన్నత విద్యామండలి సమావేశంలో ఈమేరకు యూజీసీ ఛైర్మన్ ఎం.జగదీశ్ కుమార్ వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..