ఎవరెస్టు శిఖరంపై ఇద్దరు విదేశీ అధిరోహికులు మృతి చెందారు. అమెరికా, స్విట్జర్లాండ్ కు చెందిన ఇద్దరు పర్వతారోహకులు చనిపోయారు. స్విట్జర్లాండ్ కు చెందిన ట్రెక్కర్ శిఖరం అంచులకు చేరాడని, అయితే, అక్కడకు వెళ్లాక ఊపిరాడక చనిపోయాడని సెవెన్ సమ్మిట్ ట్రెక్స్ సంస్థకు చెందిన ఛాంగ్ దావా షెర్పా తెలిపారు. అతడితో పాటు అదనంగా ఇద్దరు షెర్పాలను, వారితో పాటు ఆక్సిజన్, ఆహారాన్ని పంపించామన్నారు. అయినా దురదృష్టవశాత్తూ అతడిని బతికించలేకపోయామన్నారు. అమెరికా ట్రెక్కర్ హిల్లరీ స్టెప్ లోని క్యాంప్ 4 వరకు వెళ్లి ఇబ్బంది పడడంతో వెంటనే వెనక్కు తీసుకొచ్చామన్నారు. అతి శీతల వాతావరణంతో అతడికి చూపు మందగించిందని తెలిపారు. అనంతరం ఊపిరాడక మృతి చెందాడని చెప్పారు.
కాగా, గత వారం 30 మందికి పైగా అధిరోహికులు అనారోగ్యానికి గురయ్యారు. దీంతో వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా, ఇద్దరికి మాత్రమే పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరందరిని బేస్ క్యాంపు నుంచి తరలించారు.
ఇది చదవండి: వేడి నీళ్లతో స్నానం చేస్తే కొవిడ్ రాదన్నది అవాస్తవం: కేంద్రం స్పష్టత..