దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు రెండు రోజుల వరుస లాభాల నుంచి మళ్లిd నష్టాల వైపుకు వెళ్లాయి. 58,061.41 దగ్గర నష్టాలతో ప్రారంభమై.. ఇంట్రాడేలో 58,396.17 – 57,838.85 మధ్య ఊగిసలాడాయి. చివరకు 289.31 పాయింట్ల నష్టంతో 57,925.28 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 17,097.40 దగ్గర ప్రారంభమై.. 17,205.40 నుంచి 17,045.30 మధ్య ట్రేడైంది. చివరకు 75 పాయింట్లు నష్టపోయి 17,076.90 దగ్గర ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 32 పైసలు పుంజుకొని 82.27 వద్ద నిలిచింది.
లాభపడిన షేర్లు :
హిండాల్కో, మారుతి సుజుకీ, నెస్లే ఇండియా, భారతీ ఎయిర్‌టెల్, జెఎస్‌డబ్ల్యూ స్టీల్, వోఎన్‌జీసీ, ఐటీసీ, అదానీ గ్యాస్, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ గ్రీన్, ఏపీఎల్ అపోలో ట్యూబ్, అరబిందో ఫార్మా, టాటా కామ్, ఏబీబీ ఇండియా, ట్రెన్ట్, శ్రీరామ్ ట్రాన్స్ ఫిన్, కుమ్మిన్స్ ఇండియా, కోల్గెట్-పామాలివ్, ఇంటర్‌గ్లోబ్, ముత్తూట్ ఫైనాన్స్, సెయిల్, టోరెంట్ ఫార్మా, ఇండియన్ బ్యాంక్, హిందుస్తాన్ జింక్
నష్టపోయిన షేర్లు :
ఎస్‌బీఐ, బజాజ్ ఆటో, కోటక్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, రిల్, ఇన్ఫోసిస్, బీపీసీఎల్, యుపీఎల్, పవర్ గ్రిడ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఈఛర్ మోటార్స్, డాక్టర్ రెడ్డీస్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా కన్సూమర్, గ్రాసీం, బజాజ్ ఫిన్‌సర్వ్ ఎల్ అండ్ టీ, అదానీ పోర్ట్స్, అపోలో హాస్పిటల్స్, కోల్ ఇండియా లిమిటెడ్ షేర్లు నష్టాల బాట పడ్డాయి.