Friday, November 22, 2024

లోకేష్ పాదయాత్ర కు రెండు రోజుల బ్రేక్.. ఈసీ ఆదేశాల మేరకు నిర్ణయం

తంబళ్లపల్లె (రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి) : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన యువగళం పాదయాత్రకు రెండురోజులు విరామం ప్రకటించారు. ఎం ఎల్ఎ సి ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ప్రస్తుతం నియోజకవర్గం వీడాలంటూ ఆదేశించింది. ఎన్నికల నిబంధన విషయం పై ఉదయం స్థానిక అధికారులు తెలియ చేయగా ముందుగా అనుమతి ఇచ్చి ఇప్పుడెలా కాదంటారని తెలుగుదేశం నాయకులు ప్రశ్నించారు. ఈ లోగా తన పాదయాత్రకు అనుమతి కోరుతూ లోకేష్ ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించారు. నిబంధన ఉన్నమాట నిజమే అంటూ లోకేష్ పంపిన విజ్ఞప్తిని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.

అక్కడి నుంచి వచ్చిన సమాధానం మళ్లీ కమ్యునికేట్ చేస్తామంటూ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ఆయనకు తెలియ చేసింది. ఈ లోగా ఎన్నికల సంఘాన్ని, చట్టాలను గౌరవించి జిల్లా వీడుతున్నట్లు లోకేష్ ప్రకటించారు. ఇప్పటి వరకు 529.1 కిలోమీటర్ల యాత్ర పూర్తి చేసిన లోకేష్ శనివారం మరో 9 కిలోమీటర్లు నడిచి తంబళ్లపల్లె నియోజకవర్గం కంటేవారి పల్లి చేరుకున్నారు.. ఈ నెల 12, 13 తేదీలలో యాత్ర కు విరామం ప్రకటించారు. ఆపై అక్కడినుంచి హైదరాబాద్ బయలుదేరారు.తిరిగి 42వ రోజు పాదయాత్ర ను ఈ నెల 14 వ తేదీన కంటేవారిపల్లి నుంచి ప్రారంభమవుతుందని పార్టీ వర్గాలు ప్రకటించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement