Sunday, December 22, 2024

TG | ఉప రాష్ట్రపతి రెండు రోజుల పర్యటన.. పకడ్బందీగా ఏర్పాట్లు…

ఈ నెల‌ 25, 26 తేదీల్లో రెండు రోజుల పాటు భారత ఉపరాష్ట్రపతి జగదీప్ థాంకర్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం తెలంగాణ సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి 25న మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలం తునికి ఐసీఏఆర్‌ కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శిస్తారని, అక్కడే సేంద్రీయ విధానంలో సాగు చేస్తున్న 500 మంది రైతులతో ముఖాముఖిలో పాల్గొంటారని సీఎస్‌ తెలిపారు. 25వ తేది రాత్రి కన్హా శాంతివనంలో బస చేస్తారని తెలిపారు. 26న ఉదయం ఢిల్లీకి తిరుగు ప్రయాణం వరకు సంబంధిత విభాగాల అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ ఆదేశించారు.

రాష్ట్రపతి పర్యటన జరిగే రెండు రోజుల పాటు రంగా రెడ్డి, మెదక్‌ జిల్లా కలెక్టర్‌లు, ఉప రాష్ట్రపతి కార్యాలయంతో, రాష్ట్రంలోని అన్ని విభాగాల ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకుని పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ ఆదేశించారు. పోలీసు శాఖ పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్‌, బందోబస్త్‌ చేయాలని డిజిపిని ఆదేశించారు. ఈ పర్యటనలో సరిపడా వైద్య సిబ్బందితో వైద్య సౌకర్యాలు కల్పించాలని ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement