Saturday, September 7, 2024

Nepal : నదిలో పడ్డ రెండు బస్సులు- 65 మంది మిస్సింగ్..

నేపాల్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కొండచరియలు విరిగిపడడంతో రెండు బస్సులు త్రిశూలి నదిలో పడిపోయాయి. రెండు బస్సుల్లో కలిపి 65 మంది ప్రయాణికులు ఉండగా.. వారు నీటిలో గల్లంతయ్యారు. ఇవాళ తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో ఈ ఘోరం చోటుచేసుకుంది.

నదిలో గల్లంతైన ప్రయాణికుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వివరించారు. కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు త్రిశూలి నది ఉప్పొంగి ప్రవహిస్తోందని అధికారులు చెప్పారు. త్రిశూలి నదికి రెండువైపులా కొండలు ఉండగా.. ఓ కొండను ఆనుకుని నారాయణ్ ఘాట్ – మగ్లింగ్ రోడ్ ఉంటుంది. ఇవాళ తెల్లవారుజామున బస్సులు ఈ రోడ్ పై వెళుతుండగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో బస్సులు అదుపుతప్పి నదిలో పడ్డాయని అధికారులు వివరించారు.

ఈ ప్రమాదం గురించిన సమాచారం అందగానే పోలీసులు, సైన్యం స్పందించాయని, సహాయక చర్యలు చేపట్టాయని పేర్కొన్నారు. బోట్లతో త్రిశూల్ నదిలో గాలిస్తున్నారని వివరించారు. అయితే, వరద ఎక్కువగా ఉండడంతో గాలింపు కష్టంగా మారిందని తెలిపారు. కాగా, కొండచరియల కారణంగా నారాయణ్ ఘాట్ – మగ్లింగ్ రోడ్ ప్రస్తుతం బ్లాక్ అయిందని స్థానిక ఎస్పీ భవేష్ రిమాల్ వివరించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement