న్యూఢిల్లి : లార్సన్ అండ్ టర్బో (ఎల్‌అండ్‌టీ) తమ బిల్డింగ్స్ అండ్ ఫ్యాక్టరీస్ వ్యాపారం కోసం ప్రతిష్టాత్మక క్లయింట్స్ నుంచి పలు ఆర్డర్లను అందుకుంది. ఈ వ్యాపారంలోని ఆరోగ్య విభాగం, తెలంగాణ ప్రభుతం నుంచి వరంగల్‌లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి ఆర్డర్ పొందింది. దీనిలో భాగంగా.. 1759 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తరువాత రాష్ట్రంలో అతిపెద్ద హాస్పిటల్స్‌లో ఒకటిగా మాత్రమే గాక దేశంలో అతి పొడవైన హాస్పిటల్‌గా కూడా నిలవనుంది. ఈ 1750 పడకల మెగా ఆస్పత్రి బేస్‌మెంట్ ప్లస్ గ్రౌండ్ ప్లస్ 23 ఫోర్లుగా ఉంటుంది. దీంతో పాటు అనుబంధ భవంతుల నిర్మాణం కూడా కొనసాగుతుంది. ఈ భవంతి మొత్తం బిల్డప్ ఏరియా 1.65 మిలియన్ చదరపు అడుగులు ఉంటుంది. మొత్తం మీద 43 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం అయ్యే ఈ ఆస్పత్రిలో అన్ని ప్రత్యేక డిపార్టుమెంట్‌లు ఉంటాయి. అంటే.. అనిస్తీషియా, డెర్మటాలజీ, ఆర్థోపెడిక్, పల్మనరీ మెడిసిన్స్, రేడియాలజీ, బయో కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, పాథాలజీతో పాటు ఇతర కీలక కీలక విభాగాలు ఉంటాయి. ఇందులో ఎల్‌ఐఎన్‌ఏసీ, పీఈటీ సీటీ, 300 ఐసీయూ పడకలు, 25 మాడ్యులర్ ఓటీలు, మెడికల్ ఎకిప్‌మెంట్ సప్లై, ఇన్‌స్టాలేషన్, టెస్టింగ్ అండ్ కమిషనింగ్, ధర్మశాల, కిచెన్‌తో పాటు డైనింగ్ బ్లాక్, క్రిచే, యుటిలిటీ బల్డింగ్ 42 ఎకరాల్లో నిర్మించబడుతాయి. గ్యాస్ పైపింగ్, మాడ్యులర్ ఓటీ, న్యూమాటిక్ ట్యూబ్ సిస్టమ్, ఔటర్ రోడ్, ల్యాండ్ స్కేపింగ్ పనులతో పాటు పలు నిర్మాణాలు ఉంటాయి.
మహాలో భారీ ప్రాజెక్టు..
మహారాష్ట్రలోని రాయ్‌గడ్ సమీపంలోని నగోథానే వద్ద రెసిడెన్షియల్ టౌన్‌షిప్ నిర్మాణానికి సైతం ఎల్‌అండ్‌టీ ఓ ప్రతిష్టాత్మక సంస్థ నుంచి అనుమతులు పొందింది. దీనిలో భాగంగా 36 రెసిడెన్షియల్ టవర్లను 18 నెలల కాలంలో నిర్మించనుంది. లార్సెన్ అండ్ టర్బో కంపెనీ.. ఇండియన్ మల్టి నేషనల్ ప్రాజెక్టుల్లో కీలకంగా ఉంటుంది. హైటెక్ మ్యానుఫాక్చరింగ్, సర్వీసులను అందిస్తుంది. మొత్తం 50కు పైగా దేశాల్లో సేవలు అందుతున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..