Tuesday, November 26, 2024

మున్నేరులో ఇద్దరు గల్లంతు, చెట్టు కొమ్మ‌లు ప‌ట్టుకొని ఒకరు సురక్షితం

ఖమ్మం రూరల్ (ప్ర‌భ న్యూస్‌) : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ వరదల్లో ఒకరు గల్లంతు కాగా, మరొకరు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన గురువారం రాత్రి జ‌రిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. మండల పరిధిలోని జలగం నగర్ ప్రాంతంలో వరదలో చిక్కుకున్న కొన్ని కుటుంబాలను రూరల్ అధికారులు. ప్రజాప్రతినిధులు పునరావాస కేంద్రానికి తరలించారు. పునరావాసానికి చేరుకున్న వారిలో ఇద్దరు యువకులు పెండ్ర సతీష్ (30), జల్లి రాంబాబు వారి ఇంటి సామాన్లు తెచ్చుకోవడం కోసం రెండు మూడు సార్లు అటు ఇటు తిరిగారు.

- Advertisement -

ఈ క్రమంలో ఒకేసారి వరద పెరిగిపోవడంతో రాంబాబు అక్కడే ఉన్న చెట్టు పైకి ఎక్కాడు. సతీష్ ఎక్కలేకపోవడంతో కొద్దిసేపు కొమ్మలు పట్టుకొని ఉన్నాడు. వరద ప్రవాహం ఎక్కువ కావడంతో సతీష్ గల్లంతయ్యాడు. ఈ విషయాన్ని అక్కడే ఉన్న ఎన్డీఆర్ ఎఫ్‌ బృందం గ‌మ‌నించి రాంబాబును సురక్షితంగా బయటకు తెచ్చారు. గల్లంతైన సతీష్ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని స్థానికులు చెబుతున్నారు.

వరద సాయంత్రం ఏడు గంటలకు ఒక్కసారిగా అమాంతం పెరగడంతో జలగం నగర్ వాసులు ఆందోళనకు గుర‌య్యారు. విషయం తెలియడంతో ఎమ్మెల్సీ తాత మధు హుటా హుటిన జలగనగర్ కు వచ్చారు. అప్పటికే అక్కడికి వచ్చిన ఎంపీపీ బెల్లం వేణుగోపాల్ టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెల్లం వేణును అక్కడ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. జలగం నగర్ ప్రాంతంలో విద్యుత్ అంతరాయం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలవకుండా చూడాలని ఏసీబీ బసవ రెడ్డికి సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement