ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా ట్విటర్‌కు వ్యతిరేకంగా తీసుకు వచ్చిన థ్రెడ్స్ ఒక్క రోజులోనే 5 కోట్ల మంది యూజర్లను సొంతం చేసుకుంది. ఎలాన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసిన నాటి నుంచి అనేక సమస్యలతో సతమతమవుతోంది. దీనికి తోడు తాజాగా థ్రెడ్స్ రూపంలో ట్విటర్‌కు గట్టి సవాల్ ఎదురవుతోంది. థ్రెడ్స్ మేథో సంపత్తి హక్కులను ఉల్లంఘించిందని ఆరోపించిన ట్విటర్, దానిపై దావా వేస్తాఆమని హెచ్చరించింది. ఈ మేరకు ట్విర్ అధినేత ఎలాన్ మస్క్ లాయర్ ఆలక్స్ స్పిరో, మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌కు లేఖ రాశారు.
ఈ లేఖన అమెరికాకు చెందిన ఓ మీడియా సంస్థ బయట పట్టింది. తమ సంస్థలో పని చేసిన పాత ఉద్యోగులను మెటా నియమించుకుని తమ వాణిజ్య రహస్యాలు, ఇతర మేథోపరమైన అంశాలను తెలుసుకుందని ట్విటర్ ఆరోపించింది. చట్ట విరుద్ధంగా ఆ సమాచారాన్ని వినియోగించుకుని నకలు యాప్‌ను తయారు చేసిందని ట్విటర్ వాణిజ్య రహస్యాలను ఇతర ర హస్య సమాచారాన్ని ఉపయోగించుకుండా మెటా తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నామని, లేకుంటే న్యాయపరంగా ముందకు వెళ్లాల్సి ఉంటుందని ఆలెక్స్ స్పిరో ఈ లేఖలో హెచ్చరించారు. ఈ కథనంపై ట్విటర్‌లో స్పందించిన ఎలాన్ మస్క్ పోటీ మంచిదే కాని, మోసం సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు.
మెటా ఖండన..
ట్విటర్ ఆరోపణలను మెటా తీవ్రంగా ఖండించింది. ట్విటర్‌లో పనిచేసిన వ్యక్తులేవరినీ తాము ఉద్యోగంలోకి తీసుకోలేదని స్పష్టం చేసింది. థ్రెడ్స్ ఇంజినీరింగ్ టీమ్‌లో ట్విటర్ పాత ఉద్యోగులు లేరని తెలిపింది. అదంత పెద్ద విషయం కూడా కాదని మెటా అధికార ప్రతినిధి అండీ స్టోన్ థ్రెడ్స్‌లో పోస్ట్ చేశారు. థ్రెడ్స్ గురువారం నుంచి వందకు పైగా దేశాల్లో యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ఐరోపాలో మాత్రం డేటా ప్రైవసీ నిబంధనల కారణంగా ఇంకా అందుబాటులోకి రాలేదు.