న్యూఢిల్లీ – : దేశంలో ఎన్నికల హడావుడి ఇప్పటి నుంచే మొదలైంది. అధికార బీజేపీ, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం పీక్ స్టేజ్‌కు చేరుకుంది. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై బీజేపీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. లంకాధిపతి రావణుడి అవతారంలో ఉన్న ఒక ఫొటోను బీజేపీ ట్విట్టర్లో షేర్ చేయడంతో కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.
వివరాల ప్రకారం.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. రావణుడి అవతారంలో రాహుల్ గాంధీ ఫొటోను బీజేపీ ట్విట్టర్లో షేర్ చేసింది. ఇక, రాహుల్ ఫొటోకు మరింత వివాదాస్పదంగా టైటిల్‌ను పెట్టింది. దుర్మార్గుడు, ధర్మ వ్యతిరేకి, రాముడికి వ్యతిరేకి అంటూ కింద క్యాప్షన్ రాసుకొచ్చింది. భారత దేశాన్ని నాశనం చేయడమే రాహుల్ గాంధీ లక్ష్యం అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ కామెంట్స్ చేసింది. కాంగ్రెస్ పార్టీ ప్రొడక్షన్, జార్జ్ సోరోస్ దర్శకత్వం వహించారని ఆ పోస్టర్లో పేర్కొంది. ఈ వివాదాస్పద ఫొటోపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు