Thursday, November 21, 2024

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ట్విట్టర్ షాక్.. ట్వీట్ డిలీట్

కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీకి ట్విట్టర్ షాక్‌ ఇచ్చింది. ఆయన చేసిన ఓ ట్వీట్‌‌ను ట్విట్టర్ డిలీట్‌ చేసింది‌. రాహుల్‌ గాంధీ చేసిన సదరు ట్వీట్‌లో లైంగిక దాడికి గురైన బాలిక తల్లిదండ్రుల చిత్రాన్ని షేర్‌ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఢిల్లీలో ఇటీవల ఓ మైనర్‌పై అత్యాచారం, హత్య జరిగాయి. దీంతో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, ఎంపీ రాహుల్‌ గాంధీ బాధితురాలి కుటుంబాన్ని కలిశారు. అనంతరం రాహుల్ గాంధీ తన ట్విట్టర్‌ లో ఒక ఫోటో షేర్‌ చేశారు. ఈ ఫోటోలో బాధితురాలి తల్లిదండ్రులు కూడా కనిపించారు.

రాహుల్ ట్వీట్ నేపథ్యంలో జాతీయ బాలల హక్కుల కమిషన్‌ ఈ ట్విట్టర్‌ హ్యాండిల్‌పై చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. ట్విట్టర్ ఇండియా గ్రీవెన్స్ ఆఫీసర్‌కు చిల్డ్రన్స్ కమిషన్ రాసిన లేఖలో, మైనర్ బాధితుల కుటుంబ ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేయడం జువెనైల్ జస్టిస్ యాక్ట్, 2015 సెక్షన్ 74, బాల లైంగిక నిరోధం సెక్షన్ 23 కింద నేరం.. నేరాల చట్టం (POCSO) ఉల్లంఘన కూడా అని చెప్పింది. ముఖ్యంగా అత్యాచార బాధితురాలి ఫోటోను, వారి ఐడెంటిటీని బహిర్గతం చేయడం చట్టాన్ని ఉల్లంఘించడమేనని కమిషన్ స్పష్టం చేసింది. దీంతో ట్విట్టర్‌ రాహుల్ గాంధీ చేసిన ట్వీట్‌‌ను డిలీట్‌ చేసింది. నిబంధనలకు వ్యతిరేకంగా పోస్ట్ ఉన్నట్లు గుర్తించామని, సదరు ట్వీట్‌ను తొలగిస్తున్నట్లుగా నోటిఫికేషన్ ద్వారా రాహుల్ గాంధీకి సమాచారం ఇచ్చి ట్వీట్‍‌ను తొలగించింది.

ఈ వార్త కూడా చదవండి: కేరళ హైకోర్టు సంచలన తీర్పు.. భార్యకు ఇష్టం లేకుండా సెక్స్ చేస్తే విడాకులే

Advertisement

తాజా వార్తలు

Advertisement