మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ సరికొత్త లాగిన్ ఆప్షన్ ను తీసుకొచ్చింది. కేవలం యాపిల్ ఐడీ ఉంటే చాలు.. ట్విట్టర్ లోకి లాగిన్ అవ్వొచ్చు. యాపిల్ వస్తువులు వాడేవాళ్లు కేవలం తమ యాపిల్ ఐడీతో లాగిన్ అయ్యే ఆప్షన్‌ను ట్విట్టర్ తీసుకొచ్చింది. అలాగే.. ఆండ్రాయిడ్ ఫోన్లు, విండోస్ కంప్యూటర్లు వాడేవాళ్లు.. కేవలం గూగుల్ అకౌంట్‌తో ట్విట్టర్లోకి లాగిన్ అవ్వొచ్చు. కొత్తగా వచ్చిన ఈ ఫీచర్ వల్ల సైన్ అప్ ప్రాసెస్ ఈజీ అవుతుంది. ఈమెయిల్ ఐడీ, పాస్ వర్డ్, పేరు, ట్విట్టర్ యూజర్ హాండిల్ నేమ్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ట్విట్టర్ హాండిల్ పేరును కూడా ఆటోమెటిక్ గా సిస్టమ్ సజెస్ట్ చేస్తుంది.
ఇప్పటికే ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న యూజర్లు మాత్రం తమ అకౌంట్ రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన మెయిల్ ఐడీ డిటెయిల్స్ తో లాగిన్ అవ్వొచ్చు. అలాగే.. యాపిల్ యూజర్లు.. అప్పుడు ఇచ్చిన యాపిల్ ఐడీతో లాగిన్ అవ్వొచ్చు. ప్రస్తుతం యాపిల్ ఐడీతో కేవలం ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న డివైజ్ లలో మాత్రమే ట్విట్టర్‌కు సైన్ అప్ అయ్యే అవకాశం ఉంది. త్వరలోనే మాక్ ఓఎస్‌లో కూడా ట్విట్టర్‌తో లాగిన్ అయ్యే ఫీచర్‌ను తీసుకురానున్నారు. గూగుల్ అకౌంట్‌తో మాత్రం ఆండ్రాయిడ్ యూజర్లు, ఐఓఎస్ యూజర్లు, విండోస్ యూజర్లు వెబ్ బ్రౌజర్ తో లాగిన్ అవ్వొచ్చు.
ఇది కూడా చదవండి: రేపు దత్తత గ్రామంలో కేసీఆర్ పర్యటన