ట్విటర్‌లో ఉద్యోగుల లేఆఫ్ కొనసాగుతోంది. తాజాగా మరో 4,400 మంది ఉద్యోగలను ట్విటర్ యజమాని ఎలాన్ మస్క్ తొలగించారు. వీరంతా అవుట్ సోర్సింగ్ ఉద్యుగులే. సంస్థలో మొత్తం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు 5,500 మంది పని చేస్తున్నారు. ట్విటర్‌ను కొనుగోలు చేసిన వారం రోజుల్లోనే మస్క్ సగానికి పైగా ఉద్యోగలను తొలగించారు. తాజాగా తొలగించిన వారికి కనీసం కంపెనీ సమాచారం కూడా ఇవ్వలేదు. కంపెనీ ఇ-మెయిల్ ఇంటర్నల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్‌తో ఉద్యోగులు యాక్సెస్ కోల్పోయిన తరువాతే వారికి లేఆఫ్‌కు గురైన విషయం తెలిసింది.
తొలగించిన వారిలో అమెరికాతో పాటు అనేక దేశాల్లో పని చేస్తున్న అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. ట్విటర్‌కు చెందిన కంటెంట్ మాడరేషన్, రియల్ ఎస్టేట్, మార్కెటింగ్, ఇంజినీరింగ్ ఇతర విభాగాల్లో పని చేస్తున్న అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు తొలగించిన వారిలో ఉన్నారు. వీరి తొలగింపుపై ట్విటర్ కాని, ఎలాన్ మస్ ్క కాని అధికారిక ప్రకటన చేయలేదు. ట్విటర్, ఇతర సోషల్ మీడియా సంస్థలు తమ మాధ్యమంలో విద్వేష, ఇతర హానికర కంటెంట్‌ను కనిపెట్టి ట్రాక్ చేసేందుకు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులపై ఆధారపడుతుంటాయి. కంటెంట్ మాడరేషన్ కోసం ఇలా ఉద్యోగులను కంపెనీలు నియమించకుంటాయి.
24 గంటలు కష్టపడుతున్నా :మస్క్
ట్విటర్‌లో సమూలంగా మార్పులు తీసుకు వచ్చేందుకు దాని కొత్త యజమాని ఎలాన్ మస్క్ తీవ్రంగా కష్టపడుతున్నారు. ఆదాయం పెంచుకునేందుకు ఆయన అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఆదాయం పెంచుకునే చర్యల్లో భాగంగా ఆయన బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్ విధానాన్ని తీసుకు వచ్చారు. మరో వైపు భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నారు. ఉన్న ఉద్యోగులను కనీసం రోజుకు 12 గంటలు కష్టపడి పని చేయాలని కోరారు. ఆదాయం పెంచకుంటే సంస్థ దివాళా తీస్తుందని కూడా ఆయన హెచ్చరించారు.
జీ 20 సదస్సు నేపథ్యంలో జరిగిన ఒక బిజినెస్ కాన్ఫరెన్స్ కోసం మాట్లాడుతూ తాను వారంలో ఏడు రోజులు, ఉదయం నుంచి రాత్రి వరకు విరామం లేకుండా పని చేస్తున్నానని చెప్పారు. టెస్లా కంపెనీ కూడా యజమానిగా ఉన్న మస్ ్క ప్రస్తుతం పూర్తి సమయం ట్విటర్ కోసమే పని చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాలిలో జరుగుతున్న జీ20 సదస్సు సందర్భంగా టెస్లా, స్పేస్‌ఎక్స్‌తో ఇండోనేషియా పలు ఒప్పందాలు చేసుకోవాలని భావిస్తోంది. కొన్ని దేశాల్లో ట్విటర్ నెమ్మదిగా పని చేస్తుందని చెప్పిన మస్క్, అందుకు యూజర్ల క్షమాపణలు చెప్పారు. బ్లూటిక్‌ను తిరిగి ప్రారంభించడంలో భాగంగా కొత్త ఫీచర్‌ను తీసుకు రానున్నట్లు ఆయన తెలిపారు. ఏ ట్విటర్ ఖాతాలు తమతో అసోసియేట్ అయి ఉన్నాయో గుర్తించేలా కంపెనీలు, సంస్థలకు అధికారం ఇవ్వనున్నట్లు ఎలాన్ మస్క్ తెలిపారు.