Saturday, November 23, 2024

భారత యూజర్ల కోసం ట్విట్టర్‌లో కొత్త ఫీచర్

ప్రముఖ సోషల్ మీడియా యాప్ ట్విట్టర్ తన ఖాతాదారులకు మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ ద్వారా భారత్‌లోని వినియోగదారులు వాయిస్ మెసేజ్‌ను లైవ్‌లో పంపొచ్చు. వాయిస్ ట్వీట్ లాగానే వాయిస్ మెసేజ్ కూడా 140 సెకన్ల నిడివి ఉంటుంది. ఈ ఫీచర్ అండ్రాయిడ్, ఐ‌వోఎస్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.

ఈ ఫీచర్ పొందాలంటే మీ స్మార్ట్ ఫోన్‌లో తొలుత ట్విట్టర్ యాప్‌ను అప్‌డేట్ చేయండి. అనంతరం డైరెక్ట్ మెసేజింగ్ బాక్స్‌కు వెళ్లి వాయిస్ రికార్డింగ్ బటన్ పై క్లిక్ చేయండి. ఆ తరువాత మెసేజ్ రికార్డ్ చేసి పంపండి. మెసేజ్ పంపే ముందు మీరు ఈ ఆడియోని కూడా వినవచ్చు. ఇంకా మీకు వచ్చిన వాయిస్ మెసేజెస్ మొబైల్ యాప్ లేదా డెస్క్‌టాప్ రెండింటిలోనూ వినవచ్చు.

ఈ వార్త కూడా చదవండి: భారత్-శ్రీలంక రెండో టీ20 వాయిదా

Advertisement

తాజా వార్తలు

Advertisement