Saturday, November 23, 2024

మస్క్‌ చేతికి ట్విట్టర్‌ పిట్ట, నేడో.. రేపో అధికారిక ప్రకటన

టిట్టర్‌, ఎలాన్‌ మస్క్‌ మధ్య కంపెనీ కొనుగోలు విషయమై తీవ్ర చర్చే జరుగుతున్నది. టిట్టర్‌ సంస్థను కొనుగోలు చేస్తానని టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఏదో ఊరికే అన్నారని అందరూ భావించారు. ఎవరూ ఎలాన్‌ మస్క్‌ ఆఫర్‌ను లెక్కలోకి తీసుకోలేదు. అయినా మస్క్‌ మాత్రం టిట్టర్‌ కొనుగోలు విషయంలో ఒకే తరహా వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. టిట్టర్‌ కొనుగోలు చేస్తానంటూ ఆ కంపెనీకి పది రోజుల క్రితం ఆఫర్‌ ఇచ్చారు. ఎంతకు విక్రయిస్తారో చెప్పాలంటూ సూచించారు. టిట్టర్‌ను విక్రయించేది లేదని ఆ కంపెనీ కూడా సీరియస్‌గానే ఓ ప్రకటన విడుదల చేసింది. కానీ మస్క్‌ మాత్రం వెనక్కి తగ్గలేదు. కొనుగోలు చేసేందుకు సరిపడా డబ్బులను కూడా మస్క్‌ సిద్ధం చేసుకున్నారంటేనే.. ఎలాన్‌ ఈ డీల్‌పై ఎంత సీరియస్‌గా ఉన్నారో అర్థం అవుతుంది. అంతటితో ఆగని ఎలాన్‌.. టిట్టర్‌ కొనుగోలు కోసం హోల్డింగ్‌ కంపెనీని కూడా రిజిస్టర్‌ చేయించుకున్నాడు. ఈ పరిణామాలన్నింటినీ టిట్టర్‌ బోర్డు కూడా గమనిస్తూనే ఉంది. చివరికి టిట్టర్‌ కొనుగోలు విషయంలో ఎలాన్‌ ఆసక్తిని చూసి.. ఓ మెట్టు దిగి వచ్చింది.

ముందుకొచ్చిన ట్విట్టర్‌ బోర్డు..

మస్క్‌ నుంచి అన్ని సానుకూల పరిణామాలే వెలుగులోకి వస్తుండటంతో.. యాజమాన్యం కూడా టిట్టర్‌ను విక్రయించేందుకు ముందుకు వస్తున్నట్టు తెలుస్తున్నది. దీని కోసం ఎలాన్‌తో చర్చలు కూడా ప్రారంభించినట్టు సమాచారం. టిట్టర్‌ డీల్‌ ప్రతిపాదనను పూర్తి స్థాయిలో అంగీకరించినప్పటికీ.. ఎలాన్‌ మస్క్‌ ప్రతిపాదనను మాత్రం పరిగణలోకి తీసుకున్నట్టు సమాచారం. ఈ విషయమై.. ఆదివారం ట్విట్టర్‌ బోర్డు సభ్యులందరూ సమావేశం కూడా అయ్యారు. ఎలాన్‌ మస్క్‌ ఆఫర్‌ కూడా బోర్డు సభ్యులకు నచ్చినట్టు సమాచారం. అందుకే మస్క్‌ ప్రతిపాదనపై చర్చించేందుకు సమావేశం అయినట్టు తెలుస్తున్నది. షేర్‌ హోల్డర్ల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతోనే.. బోర్డు భేటీ అయినట్టు సమాచారం. అనుకున్నన్ని డబ్బులు వస్తే.. విక్రయించే ఆలోచనలో బోర్డు సభ్యులు ఉన్నట్టు తెలుస్తున్నది.

రుణాల సేకరణ పూర్తి..

ఎలాన్‌ మస్క్‌ ఆఫర్‌ ప్రకారం.. ఒక్కో టిట్టర్‌ షేర్‌కు 54.20 డాలర్లు చొప్పున 43 బిలియన్‌ డాలర్లు చెల్లించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తున్నది. ఈ మేరకు ఆయన వివిధ బ్యాంకుల నుంచి రుణాలు సేకరించి రెడీగా ఉంచుకున్నట్టు మస్క్‌ సన్నిహితులు చెబుతున్నారు. టిట్టర్‌ బోర్డుతో సంబంధం లేకుండా టెండర్‌ ఆఫర్‌ ద్వారా ఆయన నేరుగా వాటాదారులతో చర్చలు జరపాలని నిర్ణయించుకున్నారు. రెండు రోజుల క్రితం పలువురు వాటాదారులతో కూడా వీడియో కాల్‌ ద్వారా మాట్లాడినట్టు సమాచారం. టిట్టర్‌ ఎదుగుదలకు వాక్‌ సేచ్ఛపై నియంత్రణలు ప్రతిబంధకంగా మారాయని, వీటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని సమాచారం. వాటాదారులతో సమావేశమైన నేపథ్యంలో అప్రమత్తమైన బోర్డు రంగంలోకి దిగింది. ఆఫర్‌ బాగుంటే విక్రయించాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. పాయిజన్‌ పిల్‌ వ్యూహంతో అడ్డుకట్ట వేయాలనుకున్న యత్నాలన్నింటినీ ట్విట్టర్‌ దాదాపు పక్కన పెట్టేసినట్టు కనిపిస్తోంది. పాయిజన్‌ పిల్‌ వ్యూహంతో కంపెనీ 15 శాతానికి మించి వాటాలను సొంతం చేసుకోకుండా.. వేసిన ఎత్తుగడపైనే మస్క్‌ ఇప్పుడు దృష్టి సారించినట్టు సమాచారం. చట్టప్రకారం ఇది తనకు ప్రతిబంధకంగా మారే అవకాశం ఉందని భావిస్తున్నట్టు తెలుస్తున్నది.

- Advertisement -

బోర్డు ఒప్పుకోకపోయినా..

టిట్టర్‌ బోర్డు ఒప్పుకోకపోయినా.. వాటాదారులతో ఏకమై.. సంస్థను కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఎలాన్‌ మస్క్‌ ఉన్నట్టు సమాచారం. వాటాదారులంతా కూడా అతిక్రమించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తున్నది. టిట్టర్‌లో వచ్చే లోపాలు, సమస్యలను పరిష్కరించడంలో యాజమాన్యం విఫలం అవుతూ వస్తున్నదనేది ఎలాన్‌ మస్క్‌ ఆరోపణ. తన చేతిలోకి టిట్టర్‌ వస్తే.. సంస్థను గాడిలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తాననే ప్రకటన చేస్తున్నాడు. తన ఆఫర్‌ ఎంతో బాగుందని, ఇంతకంటే మంచి ధర ఎవరూ చెల్లించలేరనే విషయాన్ని కూడా వాటాదారుల దృష్టికి ఎలాన్‌ మస్క్‌ తీసుకొచ్చినట్టు తెలుస్తున్నది. ఆదాయం కోసం సరికొత్త మార్గాలను అన్వేషించడంతో పాటు వాక్‌ సేచ్ఛ కల్పిస్తాననే హామీ కల్పిస్తున్నాడు. పొడవైన టీట్లను అనుమతించడం, ఎడిట్‌ బటన్‌ సహా పలు మార్పులను మస్క్‌ ఇప్పటికే ప్రతిపాదించారు. రెవెన్యూ కోసం యాడ్స్‌పైన ఆధారపడకుండా ఉండేలా కంపెనీని తీర్చిదిద్దుతాననే నమ్మకాన్ని వాటాదారుల్లో కల్పించినట్టు తెలుస్తున్నది. మస్క్‌ ఇచ్చిన ఓపెన్‌ ఆఫర్‌, కంపెనీ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని..కొంత మంది వాటాదారులు ఆయనతో చేతులు కలిపినట్టు తెలుస్తున్నది. మరికొంత మంది సయంగా మస్క్‌తో చర్చలకు సిద్ధమైనట్టు సమాచారం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement