ట్విట్టర్ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి, మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌లో కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ.. పలు మార్పులు చేర్పులు చేస్తూనే ఉన్నాడు ఎలోన్ మస్క్. కాగా, ఇప్పుడు కంపెనీ ట్విట్టర్ లో బ్లూ టిక్ సబ్ స్క్రైబ్ చేసుకున్న యూజర్స్ కోసం కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ట్విట్టర్ బ్లూ వినియోగదారులు ఇప్పుడు రెండు గంటల వ్యవధి ఉన్న వీడియోలను అప్‌లోడ్ చేయవచ్చని కంపెనీ ప్రకటించింది. వినియోగదారులు ఇప్పుడు ట్విట్టర్‌లో 8GB వరకు వీడియోలను అప్‌లోడ్ చేయవచ్చు. “ట్విట్టర్ బ్లూ వెరిఫైడ్ సబ్‌స్క్రైబర్లు ఇప్పుడు 2 గంటల వీడియోలను (8GB) అప్‌లోడ్ చేయవచ్చు” అని మస్క్ ట్వీట్ చేశారు.
అంతే కాకుండా.. సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫారమ్ త్వరలో వీడియో, వాయిస్ కాల్స్ ఫీచర్‌ను పరిచయం చేయనున్నట్లు వెల్లడించింది. ట్విట్టర్ బ్లూ వినియోగదారుల కోసం డైరెక్ట్ మెసేజెస్ (DMలు) ఇప్పుడు ఎన్‌క్రిప్టెడ్ మోడ్ లో ఉన్నట్టు ఎలోన్ మస్క్ ఇటీవలే ప్రకటించారు. వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ఎన్‌క్రిప్టెడ్ మేసూజింగ్ ఫీచర్‌ను అందిస్తుంది, అయితే ఈ ఫీచర్ కు కొన్ని షరతులు, పరిమితులతో ఉన్నాయి. ఈ ఫీచర్ డిఫాల్ట్‌గా యాక్టివేట్ అయ్యి ఉండదు. దీన్ని యూజర్స్ యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంది.