Home తెలంగాణ‌ Twit – మిస్సింగ్ కేసీఆర్‌ రూల్ – ఎయిర్ జర్నీలో అపూర్వ అనుభవం

Twit – మిస్సింగ్ కేసీఆర్‌ రూల్ – ఎయిర్ జర్నీలో అపూర్వ అనుభవం

0
Twit –  మిస్సింగ్ కేసీఆర్‌ రూల్ – ఎయిర్ జర్నీలో అపూర్వ అనుభవం

కేసీఆర్‌ పాలనాధక్షతను గుర్తుచేసుకుంటున్న జ‌నం
ప్రజల నుంచి పెద్ద ఎత్తున ప్రేమాభిమానాలు
కేసీఆర్​ తాత సీఎం కావాలంటున్న చిన్నారులు
సోషల్‌ మీడియాలో మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్‌

ఆంధ్రప్రభ స్మార్ట్​, హైదరాబాద్​: ‘‘కేసీఆర్​ తాత అంటే మాకు చాలా ఇష్టం.. నా ప్రేమను ఆయనకు తెలియజేయండి’’ అంటూ కేటీఆర్​ దగ్గరకు వచ్చిన ఓ బాలుడు అన్న మాట‌లు అక్కడున్న వారిని ఆశ్చర్యపరిచాయి. కొచ్చి నుంచి హైదరాబాద్ వస్తున్న విమానంలో కెటిఆర్ కు ఈ ఇన్సిడెంట్​ తనకు ఎదురైందని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ తన ట్విట్టర్​లో షేర్​ చేసుకున్నారు. తెలంగాణతోపాటు యావత్​ దేశ ప్రజలంతా కేసీఆర్​ పాలనాదక్షతను మిస్​ అవుతున్నారని పేర్కొన్నారు.

ప్రజల నుంచి అపూర్వ ఆదరణ..

తెలంగాణ ప్రజలు ఉద్యమనేత కేసీఆర్‌ పాలనాధక్షతను మిస్‌ అవుతున్నార‌ని కేటీఆర్‌ చేసిన ట్విట్ సోషల్​ మీడియాలో వైరల్‌గా మారింది. ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ అడ్మినిస్ట్రేషన్‌ను వారు పదే పదే గుర్తు చేసుకుంటున్నార‌ని ట్విట్టర్‌ వేదికగా చేసిన వ్యాఖ్యలు, ప్రజల్లో కేసీఆర్‌పై ప్రేమను చాటుతున్నాయని తెలుస్తోందని బీఆర్‌ఎస్‌ అభిమానులు అంటున్నారు. కొచ్చిన్‌ నుంచి హైదరాబాద్‌కు ప్రయాణం చేస్తున్న క్రమంలో తనకు తోటి ప్రయాణికుల నుంచి అపూర్వ ఆదరణ లభించిందని, కేసీఆర్‌ పాలనపై ప్రశంసలు కురిపిస్తూ, ఓ ప్రయాణికుడు లేఖను అందజేశారని కేటీఆర్‌ వెల్లడించారు.

కేసీఆర్​ తాత సీఎం కావాలి..

ఇదే క్రమంలో విరాట్‌ అనే బాలుడు కేటీఆర్‌ వద్దకు వచ్చి, తనతో సెల్ఫీ దిగగా, ఆ ఫొటోను కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా షేర్ చేసుకున్నారు. ధర్మ ప్రణీత్‌, లలిత దంపతుల సంతానమైన విరాట్‌ కేసీఆర్‌ తాతపై తన ప్రేమను చాటడంతోపాటు.. మళ్లీ అధికారంలోకి రావాలి, సీఎం కావాలి అనడం కేటీఆర్‌ను, అక్క‌డున్న వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. కేసీఆర్‌ పాలనను ప్రజలు తిరిగి కోరుకుంటున్నారని అన్నారు.

Exit mobile version