Thursday, November 21, 2024

Twit – అఖండ భార‌తంలో అదానికో న్యాయం – ఆడ‌బిడ్డ‌కో న్యాయమా – మోదీని ప్ర‌శ్నించిన ఎమ్మెల్సీ క‌విత

హైద‌రాబాద్ : అఖండ భారతంలో అదానికో న్యాయం.. ఆడబిడ్డకో న్యాయమా అని ప్రశ్నించారు ఎమ్మెల్సీ క‌విత‌. ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త అదానిపై అమెరికాలో కేసు న‌మోదైన నేప‌థ్యంలో ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్ట్ చేయడం ఈజీ. ఆధారాలు ఉన్నా అదానీని అరెస్ట్ చేయడం మాత్రం కష్టమా అని క‌విత‌ ప్రధానిని ప్రశ్నించారు. ఎన్ని సార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని అదానీ వైపేనా అని సూటిగా ప్రశ్నించారు క‌విత‌. జైలు నుంచి విడుదల అయ్యాక తొలిసారి క‌విత ఈ మేర‌కు ఆమె త‌న ఎక్స్ ఖాతాలో ట్విట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement