Wednesday, December 18, 2024

Twist – మంచు వివాదంలో మ‌రో ట్విస్ట్… విష్ణు ఏ త‌ప్పు చేయ‌లేద‌న్న త‌ల్లి

త‌న పుట్టిన రోజున కేక్ తో త‌న ఇంటికి వచ్చిన మాట వాస్త‌వం
జ‌న‌రేట‌ర్ల లో పంచ‌దార పోయ‌లేద‌ని పోలీసుల‌కు లేఖ‌
మంచు మ‌నోజ్ ఫిర్యాదులో వాస్త‌వ‌లేద‌ని వివ‌ర‌ణ

హైద‌రాబాద్ – ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు కుటుంబ వివాదం నేపథ్యంలో మోహన్ బాబు భార్య నిర్మల తొలిసారి స్పందించారు. ఇంట్లో విష్ణు గొడవ చేసినట్టు జరుగుతున్న ప్రచారంపై ఆమె స్పష్టతనిచ్చారు. ఈ విషయంపై పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కు ఆమె లేఖ రాశారు. డిసెంబర్ 14న నా పుట్టినరోజు సందర్భంగా విష్ణు జల్ పల్లిలోని మా ఇంటికి కేకు తీసుకొచ్చి సెలబ్రేట్ చేశాడని లేఖలో ఆమె పేర్కొన్నారు.

ఆరోజు విష్ణు గొడవ చేశాడంటూ పోలీసులకు మనోజ్ ఫిర్యాదు చేసినట్టు తనకు తెలిసిందని చెప్పారు. ఆరోజు విష్ణు ఎలాంటి గొడవ చేయలేదని తెలిపారు. బర్త్ డే సెలబ్రేషన్ తప్ప గొడవ జరగలేదని పేర్కొన్నారు. ఇంటికి వచ్చి తన గదిలో ఉన్న వస్తువులను తీసుకుని, కాసేపు తనతో మాట్లాడి వెళ్లాడని చెప్పారు.

తమ ఇంటిపై మనోజ్ కు ఎంత హక్కు ఉందో… విష్ణుకు కూడా అంతే హక్కు ఉందని తెలిపారు. మనోజ్ ఫిర్యాదులో నిజం లేదని చెప్పారు. తాము ఇక్కడ పనిచేయలేమని చెప్పి ఇంట్లో పని చేస్తున్న వాళ్లు మానేశారని ఇందులో కూడా విష్ణు ప్రమేయం లేదని తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement