ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆరోపణలను ఎదర్కొంటున్న ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారణ చేస్తోంది. ఇవ్వాల (మంగళవారం) ఉదయం ఢిల్లీలోని ఈడీ ఆఫీసుకు హాజరైన కవిత.. 8 గంటలుగా అక్కడే ఉన్నారు. ఆమెను పలు అంశాలపై అధికారులు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, విచారణ మధ్యలో ఈడీ అధికారులు కవిత న్యాయబృందానికి కబురు పంపినట్టు సమాచారం.
దీంతో కవిత న్యాయవాది సోమ భరత్ హుటాహుటీన ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు. వారు కోరిన సమాచారానికి సంబంధించిన కీలక డాక్యుమెంట్లను అధికారులకు అందజేసినట్టు సమాచారం. ఈ సందర్భంగా సోమ భరత్ వెంట బీఆర్ఎస్ నేత దేవీప్రసాద్ కూడా ఉన్నారు. కవిత విచారణ నేపథ్యంలో ఢిల్లీలోని ఈడీ కార్యాలయం వద్ద 144 సెక్షన్ విధించారు. ఈడీ ఆఫీసులోని 3వ ఫ్లోర్లో కవిత విచారణ కొనసాగుతోంది.