కరోనా వైరస్ ఓ ఇద్దరు కవలను బలి తీసుకుంది. గంటల వ్యవధిలోనే ఇద్దరు యువకులైన కవలలు ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన యూపీలోని మీరట్‌లో చోటు చేసుకుంది. 24 ఏళ్ల వయసు కలిగిన జాఫ్రెడ్, రాల్‌ఫ్రెడ్ కవల పిల్లలు. వీరిద్దరూ ఇంజినీర్స్ కాగా, వారి తల్లిదండ్రులిద్దరూ టీచర్లే. అయితే మే 1న ఆ కవలలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
దీంతో ఇద్దరు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. మే 10న మరోసారి పరీక్షలు నిర్వహించగా, కరోనా నెగిటివ్ రావడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. కవలల్లో ఒకరికి మే 13 రాత్రి శ్వాస తీసుకోవడంలో సమస్యలు తలెత్తాయి. రాత్రి 11 గంటల సమయంలో అతడు చనిపోయాడు. మే 14న తెల్లవారుజామున మరో కుమారుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆ కవలల తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.