Friday, November 22, 2024

నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా 40అంత‌స్తుల జంట ట‌వ‌ర్లు-ఈ నెల 28న కూల్చివేత

భారీ అపార్ట్ మెంట్ ని ఈ నెల 28న కూల్చివేసేందుకు అనుమ‌తినిచ్చింది సుప్రీంకోర్టు. ఏదైనా సాంకేతిక లోపాలు, వాతావరణ సంబంధిత సమస్యల ఏర్పడితే కూల్చివేత పూర్తి చేసేందుకు వారం రోజు బఫర్ టైమ్ ఇచ్చింది. జంట టవర్ల కూల్చివేతకు 3,500 కిలోల పేలుడు పదార్థాలను ఉపయోగిస్తామని అధికారులు తెలిపారు. వీటిని టవర్ల పిల్లర్లతో పాటు ఇతర ప్రాంతాల్లో చేసిన 9,400 రంధ్రాల్లో నింపుతామన్నారు. రియల్ ఎస్టేట్ దిగ్గజం సూపర్‌టెక్ నిర్మించిన 40 అంతస్తుల ట్విన్ టవర్లను కూల్చివేయాలని గత ఏడాది ఆగస్టు 31న సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ టవర్లలో 900 ఫ్లాట్లు, 21 దుకాణాలు ఉన్నాయి.కాగా నోయిడాలో నిబంధనలకు విరుద్ధంగా 100 మీటర్ల ఎత్తులో కట్టిన 40 అంతస్తుల జంట టవర్లను ఈ నెల 28వ తేదీకూల్చివేయనున్నారు. ఈ టవర్లను ముందుగా ఈ నెల 21న కూల్చివేయాలని కోర్టు ఆదేశించింది. తాజాగా కూల్చివేత డెడ్ లైన్ ను వారం రోజులు పొడిగించింది. మొత్తం ప్రక్రియను సెప్టెంబర్ 4వ తేదీ లోగా పూర్తి చేయాలని నోయిడా అథారిటీని ఆదేశించింది. దివాలా తీసిన సూపర్‌ టెక్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ నిర్మించిన ఈ టవర్స్ ను కూల్చేందుకు మరికొంత గడువు కావాలని నోయిడా అధికారులు కోర్టును కోరారు. వారి విజ్ఞప్తిని కోర్టు అంగీకరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement