Friday, November 22, 2024

Tvs | 2024లో మరిన్ని ఎలక్ట్రిక్‌ బైక్‌లు

2024లో తమ విద్యుత్‌ ద్విచక్ర వాహన పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తామని టీవీఎస్‌ మోటార్‌ తెలిపింది. వివిధ ధరల శ్రేణితో కస్టమర్లకు చేరువవుతామని పేర్కొంది. ప్రస్తుతం ఈ కంపెనీ రెండు ఇ-స్కూటర్లను విక్రయిస్తోంది. రాబోయే రోజుల్లో విక్రయ మౌలిక వసతులను సైతం విస్తరిస్తామని తెలిపింది. ఓ ఎలక్ట్రిక్‌ త్రీ-త్రీలర్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించింది. వచ్చే ఏడాది వ్యవధిలో 5-25 కిలోవాట్ల మధ్య శ్రేణిలో వరుస స్కూటర్లను విడుదల చేస్తామని టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ డైరెక్టర్‌ సీఈఓ కె.ఎన్‌.రాధాకృష్ణన్‌ తెలిపారు.

ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న తమ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఐక్యూబ్‌కు మార్కెట్‌లో మంచి గిరాకీ ఉందని పేర్కొన్నారు. దీంతో నెలవారీ ఉత్పత్తి సామర్థ్యాన్ని 25 వేల యూనిట్లకు పెంచినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో దీన్ని మరింత పెంచుతామని పేర్కొన్నారు. ప్రస్తుత త్రైమాసికంలోనే టీవీఎస్‌ తమ కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ‘టీవీఎస్‌ ఎక్స్‌ విక్రయాలను ప్రారంభించనుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తమ ఇ-స్కూటర్ల కోసం 400 టచ్‌పాయింట్లు ఉన్నాయని రాధాకృష్ణన్‌ తెలిపారు.

రాబోయే రోజుల్లో కొత్త ఉత్పత్తుల వరుస విడుదల నేపథ్యంలో మౌలిక వసతులను మరింత విస్తరిస్తామని పేర్కొన్నారు. మరోవైపు ఎగుమతుల గురించి మాట్లాడుతూ.. వచ్చే రెండు, మూడు త్రైమాసికాల్లో ఐక్యూబ్‌ చాలా మార్కెట్లలోకి విస్తరిస్తుందని తెలిపారు. ఐరోపా మార్కెట్‌లోకీ ప్రవేశిస్తామన్నారు. స్పష్టమైన వ్యూ#హం, ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని.. దశలవారీగా ఇతర మార్కెట్లకూ విస్తరిస్తామని పేర్కొన్నారు. దేశీయ, విదేశీ విపణుల్లో ‘టీవీఎస్‌ ఎక్స్‌’ కీలక పాత్ర పోషిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement