తెలంగాణ (భారత్)తో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు తాము ఆసక్తిగా ఉన్నామని టర్కీ రాయబారి ఫిరత్ సునెల్ తెలిపారు. శుక్రవారం ఆయన సచివాలయంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరూ అరగంట పాటు పరస్పర సహకారంపై చర్చించుకున్నారు.
శ్రీధర్ బాబు మాట్లాడుతూ టర్కీ-తెలంగాణ మధ్య చారిత్రక, సాంస్కృతిక సంబంధాలు చాలా కాలంగా కొనసాగుతున్నాయన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం, ఫార్మా, లైఫ్ సైన్సెస్, వాణిజ్య రంగాల్లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఆయన తెలిపారు.
టర్కీ పారిశ్రామిక ప్రతినిధుల బృందాన్ని పంపితే వారు ఇక్కడి ఎకోసిస్టమ్ ను పరిశీలించే అవకాశం ఉంటుందన్న అభ్యర్థనకు రాయబారి ఫిరట్ సునెల్ సుముఖత వ్యక్తం చేసారు. ఈ సమావేశంలో టర్కీ కాన్సుల్ జనరల్ ఒర్హాన్ యమన్ ఓకాన్ కూడా పాల్గొన్నారు.