Saturday, November 23, 2024

టర్కీని ముంచెత్తిన వరదలు..77 మంది మృతి..

టరీ భారీ వరదలకు అతలాకుతలమవుతోంది. వాయువ్య నల్ల సముద్రం ప్రావిన్స్‌లో కురిసిన భారీ వర్షాలకు వరద ఉప్పొంగింది. ప్రవాహం ధాటికి పలు ఇండ్లు, వంతెనలు కుప్పకూలిపోయాయి. వరదల దాటికి ఇప్పటివరకు 77 మంది మృతి చెందారు. కాస్టామోను ప్రావిన్స్‌లో కనీసం 62 మంది మరణించారు. సినోప్‌లో 14 మంది, బార్టిన్‌లో ఒకరు మరణించారని టర్కీ విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు చెప్పారు. కాస్టామోను, సినోప్‌ ప్రాంతాల్లో పలువురు గల్లంతు అయ్యారు. 8,500 మందికిపైగా సహాయ సిబ్బంది వరదసహాయ పునరావాస పనులు చేపట్టారు. 30కిపైగా గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. భారీవర్షాలతో నల్లసముద్రం ఉత్తర తీరంలో 2వేల మంది ప్రజలను ఖాళీ చేయించి, సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ఇది కూడా చదవండి: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఇకపై ఆ జీవోలు కనిపించవు

Advertisement

తాజా వార్తలు

Advertisement