Tuesday, November 26, 2024

ఐటిఐఆర్ వ‌స్తే ద‌శ తిరిగేది…..

హైదరాబాద్‌, హైదరాబాద్‌కు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌ (ఐటీఐఆర్‌) రాకపోవడానికి కేంద్ర ప్రభుత్వమే కారణమని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌తో వివాదం రాజుకుంది. తెలంగాణకు ఐటీఐఆర్‌ ఇవ్వనందుకు టీఆర్‌ఎస్‌ నేతలు కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ను తప్పు పడుతున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం గత ఏడేళ్లుగా కనీసం ఐటీఐఆర్‌ కోసం డీటెయిల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు కూడా పంప లేదని బీజేపీ నేతలు ఎదురు దాడికి దిగారు. తమ వాదనకు కాగ్‌ నివేదిక ఆధారమని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఐటీఐఆర్‌ ప్రాజెక్టు అమలు కాకపోవడానికి కారణం రాష్ట్ర ప్రభు త్వంలో చిత్తశుద్ధి లోపించడమే కారణమని కాగ్‌ నివేదిక ఇచ్చింది. వీరిద్దరి మధ్య జరుగుతున్న వాదోప వాదాలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి.
ప్రతిపాదనలు ఇలా..
హైదరాబాద్‌ చుట్టూ వివిధ కస్టర్లలో ఐటీ, హార్డ్‌వేర్‌, ఈఎస్‌డీఎం పరిశ్రమల ఏర్పాటు లక్ష్యంగా ఐటీఐఆర్‌ ప్రతిపాదన జరిగింది. ఫలక్‌నుమా నుంచి ఎయిర్‌పోర్టు వరకు ఎంఎంటీఎస్‌, మెట్రోరైల్‌ పొడిగింపును ప్రతిపాదించారు. రేడియల్‌ రోడ్ల అభివృద్ధి లాంటి మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంది. యుద్ధ ప్రాతిపది కన అధికారులు కసరత్తు జరిపారు. రీజియ న్‌లో మౌలిక వసతుల కల్పన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌తో పాటు విశాఖ పట్నంలోనూ ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయా లని కేంద్రం నిర్ణయించింది. విశాఖ కంటే ముందే హైదరాబాద్‌ ఏరియాలో అందుబాటు లోకి తేవాలని తెలంగాణ ప్రభుత్వం పట్టుదల ప్రదర్శించింది. హైదరాబాద్‌ పరిసరాల్లో అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలను వినియోగించాలని తలపెట్టారు. ఐటీఐఆర్‌ విషయంలో తెలంగాణ ప్రభుత్వం పట్టుదలగా వ్యవహరించగా, మంత్రి కేటీఆర్‌ మూడుసార్లు ఐటీఐఆర్‌పై అధికారులతో సమీక్ష జరిపారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై చర్చించారు. ఐటీఐఆర్‌పై యుద్ధ ప్రాతిపదికన డీపీఆర్‌ రూపొందించారు. భూ సేకరణ ప్రక్రియకు సిద్ధమైంది. ఏ ప్రాంతాలను ప్రాజెక్టు కేంద్రా లుగా చేయాలన్న అంశంపై చర్చలు జరిపారు. ప్రస్తుతం ఉన్న భూముల్లో అభివృద్ధిని కొనసా గించడం, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బ్రౌన్‌ ఫీల్డ్‌, గ్రీన్‌ ఫీల్డ్‌ అభివృద్ధి చేయడం, ప్రస్తు ్తతమున్న నివాసాలు, ప్రజలను గ్రోత్‌ కారిడార్‌ ద్వారా అనుసంధానించడం, హెచ్‌ఎండీఏ మాస్టర్‌ ప్లాన్‌లో చేర్చడం, సహజమైన అను కూలతలతో ప్రాజెక్టును ముందుకు తీసుకు పోవడం వంటివి ఐటీఐఆర్‌లో చేర్చారు.
ఐటీఐఆర్‌ ప్రాంతంలో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. రీజియన్‌ లోనే స్కూళ్లు, కళాశాలలు, ఆస్పత్రుల వంటి సదుపాయాలు కల్పించనున్నారు. మంచినీరు, విద్యుత్‌, మురుగునీటి పారుదల ఏర్పాటు చేయనున్నారు. 4జీ సేవలు కల్పించాలని ముందుగా ప్రతిపాదించారు. కానీ ఇప్పుడు దీనిని 5జీకి మార్చాలని ప్రతిపాదిస్తున్నారు. కేబుల్స్‌ వేయడం, టవర్ల నిర్మాణం వంటి పనులు చేపడతారు. మునిసిపాలిటీల్లో ఇప్పటికే 70 శాతానికిపైగా పనులు పూర్తయ్యాయి. హైదరాబాద్‌లో 50 శాతం పనులు పూర్తయ్యాయి. ట్రాఫిక్‌ రద్దీ, ఇరుకైన రహదారులతో హైదరాబాద్‌లో కేబుళ్లు వేయడంలో ఆటంకాలు తలెత్తాయి.
అనూహ్య ప్ర‌గ‌తికి అవ‌కాశాలు….
ఐటీఐఆర్‌లో భాగంగా హైదరాబాద్‌లోని మూడు ప్రాంతాలు ఓఆర్‌ఆర్‌ ద్వారా రెండు మార్గాల్లో అనుసంధానం చేయాలని తలపెట్టారు. హైటెక్‌సిటీ కేంద్రంగా నార్త్‌ – వెస్ట్‌ (వాయువ్యం) 86.70 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఐటీఐఆర్‌ జోన్‌ ఒకటని ప్రతిపా దించారు. జోన్‌-2 ఐటీఐఆర్‌ దక్షిన ప్రాంతంలో ఉంటుంది. ఇందులో హార్డ్‌వేర్‌ పార్కు, ఫ్యాబ్‌ సిటీ, ఏఐఐఐసీ వర్క్‌ సెంటర్‌ ఏర్పాటును ప్రతిపాదించారు. మహేశ్వరం మండలం పరిధిలో ఉన్న ఈ జోన్‌ మొత్తం విస్తీర్ణం 79.22 చదరపు కిలోమీటర్లు. ఐటీఐఆర్‌ మూడో జోన్‌ నార్త్‌ ఈస్టర్న్‌ విభాగంగా పరిగణిస్తున్నారు. పోచారం నుంచి ఉప్పల్‌ మునిసిపాలిటీ ప్రాంతాలలోని నేషనల్‌ హైవే-202తో కలుపుతున్న అంతర్గత కారిడార్‌ ఇది. దీని విస్తీర్ణం 10.25 చదరపు కిలోమీటర్‌. ఐటీఐఆర్‌లో పశ్చిమ ప్రాంత విస్తీర్ణం 11.50 చదరపు కిలోమీటర్లు. దీనిని జోన్‌ నాలుగుగా పరిగణిస్తూ జోన్‌-1, జోన్‌-2 ప్రాంతాలతో జోన్‌-4 ప్రాంతం ఓఆర్‌ఆర్‌ వెంబడి అనసంధా నించా లని తలపెట్టారు. హైదరాబాద్‌ నగరానికి తూర్పు ప్రాంతంలో ఐదో జోన్‌ ఏర్పాటును ప్రతిపాదిం చారు. జోన్‌-2 ప్రాంతం, జోన్‌-3 ప్రాంతం ఓఆర్‌ఆర్‌ వెంబడి అనుసంధా నిస్తూ 14.32 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలని తలపెట్టా రు. ఇంత అభివృద్ధికి అవకాశం ఉన్న ఐటీఆర్‌ ప్రతిపాదన.. కారణాలేవైనా వెన క్కు వెళ్ళడం హైదరా బాద్‌ ప్రగతి విస్తరణపై ప్రభావం చూపింది. కేంద్రం పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం.. ఐటీఐఆర్‌ హామీ నెరవేర్చాలని తెలంగాణ ప్రజలు కోరుతు న్నారు. ఐటీఆర్‌ను ఇచ్చింది కాంగ్రెస్‌ అని, టీఆర్‌ఎస్‌.. బీజేపీ కలిసి పోగొట్టాయని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు.

కెసిఆర్ లేఖ‌
2014 జూన్‌లో ఐటీఐఆర్‌పై ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్‌ తొలి లేఖ రాశారు. 2014 సెప్టెంబరులో పూర్తి వివరాలతో కేంద్రానికి మరో వినతిపత్రం అంద జేశారు. ఆ తర్వాత ఎప్పుడు ఢిల్లిdకి వెళ్లినా ఈ అంశాన్ని ప్రధాని ముందు కేసీఆర్‌ లేవనెత్తేవారు. ఆ తర్వాత కేటీఆర్‌ కూడా కేంద్ర ఐటీ శాఖ మంత్రిని కలిసి వినతిపత్రం సమ ర్పించారు. 2017లో ఐటీఐఆర్‌పై కేంద్రం సమీక్ష నిర్వహిం చింది. రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేయకుండా.. లేఖ రాసిందనే వాదన బీజేపీ నేతలు తెరమీదికి తెచ్చారు. తెలంగాణ ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదని కాగ్‌ 2017 నివేదికలో ప్రస్తావించిన విషయాన్ని బీజేపీ నేతలు ఉటంకిస్తున్నారు.

ఇది ఐటిఐఆర్ అస‌లు క‌థ‌..
ఐటీఐఆర్‌ అంటే ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మె ంట్‌ రీజియన్‌. దేశంలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ), ఐటీఈఎస్‌, ఈహెచ్‌ఎం (ఎలక్ట్రానిక్‌ హార్డ్‌వేర్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌) యూనిట్లలో పెట్టుబడులకు ఊతమివ్వాలని కేంద్రం నిర్ణయించింది. 2008, మే 28న దేశంలో ఐటీఐఆర్‌ల ఏర్పాటుకు కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఐటీఐఆర్‌ విభాగాన్ని నోడల్‌ ఏజెన్సీ ఏర్పాటును ఆనాటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. 2010 జనవరిలో కేంద్రానికి డీపీఆర్‌ను సమర్పించారు. 2012 ఆగస్టు లో హైపవర్‌ కమిటీ (హెచ్‌పీసీ) ముందుకు ఐటీఐఆర్‌ ప్రతిపాదన వెళ్లింది. అనంతరం ఐటీఐఆర్‌ డీపీఆర్‌కు ప్రాథమికంగా ఆమోదం లభించింది. అంతిమ ఆమోదం కోసం కేబినెట్‌ కమిటీ ఫర్‌ ఎనకమిక్‌ అఫైర్స్‌ (సీసీఈఏ)కు డీపీఆర్‌ను పంపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement