శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగితేనే క్షయ వ్యాధి దూరమవుతుందని, మాంసం తింటేనే బలం వస్తుందనే ఆపోహాలు మానుకుని కంది పప్పు, గుడ్డు, ఆకుకూరలలోనూ మాంసకృత్తులు ఉంటాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. వైద్యుల సూచనలు, జాగ్రత్తలు పాటిస్తే క్షయ వ్యాధి నయం అవుతుందన్నారు. వనపర్తిలోని పెబ్బెరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం 42 మంది క్షయ వ్యాధిగ్రస్తులకు తన సొంత డబ్బులతో నిత్యావసర కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగాలంటే మంచి ఆహారం తీసుకోవాలన్నారు. క్షయ వ్యాధికి ఆరు నెలల చికిత్స సమయంలో వైద్యులు సూచించిన జాగ్రత్తలు పాటిస్తే వ్యాధి నయం అవుతుందని అన్నారు. క్షయ సోకిందని భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. నిత్యావసరాల కిట్ లో నెలకు 5 కిలోల సన్నబియ్యం, 2 కిలోల మంచినూనె, ఒక కిలో కందిపప్పు, 30 గుడ్లను అందజేస్తున్నామని అన్నారు.
శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగితేనే క్షయ వ్యాధి దూరం : మంత్రి నిరంజన్‌రెడ్డి
Advertisement
తాజా వార్తలు
Advertisement