కరోనా కేసును మళ్లీ పెరుగుతుండడంతో తిరుపతి దేవస్థానం భక్తుల పై టీటీడీ ఆంక్షలు విధించింది. స్వామివారి దర్శనం టికెట్లు కలిగిన భక్తులనే తిరుమల కొండపైకి అనుమతిస్తున్నారు. ఈ కొత్త నిబంధనలు సోమవారం నుంచి అమల్లోకి రావడంతో ఇవాళ వచ్చిన భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. టీటీడీ తాజా ఆంక్షల గురించి సమాచారం లేని భక్తులు అలిపిరి, మెట్ల మార్గం వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకోగా, వారిని విజిలెన్స్ సిబ్బంది అడ్డుకున్నారు. దాంతో భక్తులు టీటీడీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.వాహనాల్లో వచ్చేవారికి దర్శనం సమయానికి ఒకరోజు ముందు మధ్యాహ్నం 1 గంట నుంచి కొండపైకి అనుమతిస్తారు. మెట్ల దారిలో వచ్చే భక్తులను దర్శన సమయానికి ముందురోజు ఉదయం 9 గంటల నుంచి కొండపైకి అనుమతిస్తారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement