తిరుమల : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై.చంద్రచూడ్ గురువారం ఉదయం తొలిసారిగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని, శ్రీ వరాహస్వామి వారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయం వద్దకు వచ్చిన జస్టిస్ డివై.చంద్రచూడ్ కు టిటిడి చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, ఈవో(ఎఫ్ఏసి) అనిల్ కుమార్ సింఘాల్, అర్చకులు కలిసి సంప్రదాయబద్ధంగా ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. గర్భాలయంలో స్వామివారి మహత్యాన్ని, ఆలయ చరిత్రను అర్చకులు వివరించారు. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో చీఫ్ జస్టిస్‌కు వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర ప్రముఖులకు తీర్థప్రసాదాలు, డ్రైఫ్లవర్ టెక్నాలజీతో రూపొందించిన శ్రీవారి చిత్రపటం, 2023 టిటిడి క్యాలెండర్, డైరీలను చైర్మన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఈవో(ఎఫ్ఏసి) వీరబ్రహ్మం, సివిఎస్వో నరసింహ కిషోర్, ఆలయ డెప్యూటీ ఈఓ రమేష్ బాబు, విజివోలు బాలిరెడ్డి, గిరిధర్ తదితరులు పాల్గొన్నారు.
TTD NEWS : శ్రీవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
Advertisement
తాజా వార్తలు
Advertisement