ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. నిన్న ఒక్క రోజే వెయ్యికి పై చిలుకు కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా స్కూల్స్, కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే టిటిడి పాలక మండలి కొత్త రూల్స్ ను తెరపైకి తీసుకువచ్చింది. ఈ రూల్స్ ప్రకారం దర్శన సమయానికి 24 గంటల ముందే నడకదారి భక్తులకు అనుమతించనున్నారు. అలాగే ఒక గంట తరువాతే రేపటి రోజు దర్శనం టికెట్లు ఉన్న భక్తులకు ఘాట్ రోడ్ లో అనుమతించనున్నారు. కాగా ఈ సమాచారం తెలియక అలిపిరి వద్ద భక్తులు ఎక్కువగా గుమిగూడుతున్నారు. దీంతో భక్తులను అదుపు చేయలేక అధికారులు చేతులెత్తేస్తున్నారు. టిటిడి పెట్టిన ఈ నిబంధనల వలన భక్తులకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
తిరుమలలో కొత్త రూల్స్…తెలుసుకుని వెళ్ళండి !!
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement