టీటీడీ పాలక మండలి కీలక సమావేశం ప్రారంభమైంది. 49 అంశాలతో టీటీడీ అధికారులు ఎజెండా రూపొందించారు. ఈ సమావేశంలోనే పాలక మండలి టీటీడీ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. 2022-23 వార్షిక బడ్జెట్ 3,171 కోట్ల అంచనాగా ప్రవేశపెట్టనుంది టీటీడీ బోర్డు. శ్రీవేంకటేశ్వర అపన్న హృదయ స్కీమ్ పేరుతో మరో నూతన పథకానికి పాలక మండలి శ్రీకారం చుట్టనుంది. ఈ పథకానికి లక్ష రూపాయలు విరాళమిచ్చిన దాతలకు ప్రివిలేజ్‌గా ఒకసారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించనున్నారు. శ్రీవేంకటేశ్వర అపన్న హృదయ స్కీమ్‌కు ఇచ్చిన విరాళాలను చిన్న పిల్లల ఆపరేషన్ ఖర్చులకు వినియోగించనున్నారు. ఈ ఏడాది రూ.వెయ్యి కోట్లు హుండీ ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించడంపై నిర్ణయం తీసుకోనున్నారు. టీటీడీ బోర్డు కొత్త పీఆర్సీని టీటీడీలో అమలు చేయనుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital