కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి కొలువు దీరిన తిరుమల హనుమంతుడి జన్మస్థలమని టీటీడీ ఈవో కేఎస్ జవహర్‌రెడ్డి స్పష్టంచేశారు. దీనికి సంబంధించిన ఆధారాలు తమవద్ద ఉన్నాయని తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘హనుమంతుడి జన్మస్థలంపై పండితులు ఆధారాలు సేకరించారు. టీటీడీ వద్ద ఉన్న ఆధారాలను బయటపెడుతాం. ఆ ఆధారాలతో ఒక నివేదిక తయారు చేశాం. నివేదికను ప్రజల ముందుంచి అభిప్రాయాలు సేకరిస్తాం. హనుమంతుడి జన్మస్థలం తమదేనని ఏ రాష్ట్రం ప్రకటించలేదు. ఇతర రాష్ట్రాలు కూడా ఆధారాలు ఉంటే బయటపెట్టవచ్చు. హనుమంతుడి జన్మస్థలంపై క్షేత్రస్థాయిలో చర్చ జరగాలి’ అని జవహర్‌రెడ్డి పేర్కొన్నారు. తిరుమల సప్తగిరుల్లో ఒకటైన అంజనాద్రిలోనే ఆంజనేయుడు జన్మించాడన్న విషయంపై నిర్ధారణకు గత ఏడాది డిసెంబరులో పండితులు, నిపుణులతో టీటీడీ కమిటీని ఏర్పాటు చేసింది. దీనిపై పరిశోధన సాగించిన కమిటీ నివేదికను సమర్పించింది.
తిరుమలే హనుమంతుడి జన్మస్థలం.. టీటీడీ వివరణ
By ramesh nalam
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement