Friday, November 22, 2024

ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ ఆఫర్‌.. బెంగళూరు-విజయవాడ రూట్‌లో 10 శాతం రాయితీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం బెంగళూరు-విజయవాడ రూట్‌లో టికెట్‌పై 10 శాతం రాయితీ కల్పించాలని టీఎస్‌ ఆర్టీసీ నిర్ణయించింది. ఆ రెండు మార్గాల్లో రాకపోకలు సాగించే ప్రయాణికులు ముందస్తు రిజర్వేషన్‌ చేయించుకుంటే తిరుగు ప్రయాణంపై 10 శాతం డిస్కౌంట్‌ను సంస్థ ఇవ్వనుంది. ముందస్తు రిజర్వేషన్‌ ఉన్న అన్ని సర్వీసుల్లో ఆదివారం నుంచి ఈ ఆఫర్‌ అమల్లోకి వస్తుంది. ఈ రాయితీ ఆగస్టు 15 వరకు అందుబాటులో ఉండనుంది.

విజయవాడ-బెంగళూరు మార్గాల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందనీ, వారికి ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశ్యంతోనే ముందస్తు రిజర్వేషన్‌ సదుపాయం ఉన్న అన్ని సర్వీసుల్లో 10 శాతం రాయితీ కల్పించాలని నిర్ణయించింది. ఈ డిస్కౌంట్‌ వల్ల విజయవాడ మార్గంలో రూ.50 వరకు బెంగళూరు మార్గంలో రూ.100 వరకు ఒక్కో ప్రయాణికుడికి ఆదా అవుతుంది. ఆగస్టు 15 వరకు అందుబాటులో ఉండే ఈ రాయితీ సదుపాయాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండి విసి సజ్జన్నార్‌ కోరారు.

- Advertisement -

తార్నాక ఆసుపత్రిలో వైద్యులకు సన్మానం

జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ఆర్టీసీ తార్నాక ఆసుపత్రిలోని 55 మంది డాక్టర్లను ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్‌ సన్మానించారు. తార్నాక ఆసుపత్రిని సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దడంలో ప్రతీ వైద్యుడి కృషి ఉందనీ, సిబ్బందికి మెరుగైన, నాణ్యమైన సేవలు అందిస్తుండటం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement