Monday, November 18, 2024

తిరుమల భక్తులకు టిఎస్‌ ఆర్టీసీ మరిన్ని సేవలు.. బస్‌ టికెట్‌తో పాటు శీఘ్ర దర్శనం టోకెన్‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళే భక్తులకు మరిన్ని సేవలను ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రతిరోజు వెయ్యి మందికి రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లను బుక్‌ చేసుకునే వెసులుబాటుతో పాటు శ్రీవారిని దర్శించు కోవాలనుకునే భక్తులకు బస్‌ టికెట్‌, శీఘ్ర దర్శన టోకెన్‌ కూడా పొందే వీలు కల్పిస్తున్నారు. తిరుమల తిరుపతి వెంకన్న సన్నిధికి తెలంగాణ రాష్ట్రం నుండి వెళ్లే బస్సులను నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ ప్రధాన బస్టేషన్‌ వద్ద శుక్రవారం టీఎస్‌ ఆర్టీసీ చైర్మన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ ప్రారంభించనున్నారు. ఇప్పటి వరకు బుకింగ్‌ చేసుకున్న భక్తులను బస్సులలో తిరుపతికి చేరవేస్తారు. తితిదే ప్రత్యేకంగా టీఎస్‌ ఆర్టీసీ ప్రయాణీకులకు రోజువారీ 300, ప్రత్యేక శీఘ్ర దర్శన వెయ్యి మందికి టిక్కెట్లను జారీ చేయనుందని ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. తిరుమల వెళ్లే ప్రయాణికులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కల్పించడం విశేష పరిణామమని ఆయన పేర్కొన్నారు.

ఆర్టీసీకి యాత్రికుల ఆదరణ లభిస్తుందన్న ఆశాభాశాన్ని ఆయన వ్యక్తంచేశారు. ఆర్టీసీ బస్సులో తిరుమలకు టిక్కెట్టు రిజర్వేషన్‌ చేసుకునే సమయంలోనే దర్శనం టిక్కెట్‌ కూడా బుక్‌ చేసుకున్న ప్రయాణీకులకు ఈ ప్రత్యేక సదుపాయం అందుబాటులో ఉందన్నారు. తిరుపతి నుంచి తిరుమలకు అక్కడి స్థానిక బస్సులో తీసుకెళ్లి ఉదయం 10 గంటలకు శీఘ్ర దర్శనం కల్పించనున్నట్ల తెలిపారు. ఈ దర్శన టికెట్లను టీఎస్‌ ఆర్టీసీ వెబ్‌సైట్‌ లేదా అధీకృత డీలర్‌ ద్వారా రిజర్వు చేసుకోనే అవకాశం ఉందన్నారు. అయితే బస్‌ టికెట్‌తో పాటే దర్శన టికెట్‌నూ బుక్‌ చేసుకోవాలన్నారు. తిరుమల శ్రీవారి దైవ దర్శనం కోసం ప్రయాణికులకు ఇది చాలా మంచి సౌకర్యవంతంగా ఉంటుందని గోవర్దన్‌ పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం టీఎస్‌ ఆర్టీసీ వెబ్‌సైట్‌ను వీక్షించాలన్నారు. ఆన్‌లైన్‌ లేదా టికెట్‌ బుకింగ్‌ కౌంటర్లలో ఈ ప్యాకేజీని పొందవచ్చంటూ కనీసం ఏడు రోజుల ముందుగానే టికెట్‌ను బుక్‌ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఈ అమూల్యమైన అవకాశాన్ని టిఎస్‌ ఆర్టీసీ బస్సులో ప్రయాణించే భక్తులు వినియోగించుకోవాలని కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement