డ్రోన్ టెక్నాలజీని విస్తృతంగా వినియోగిస్తున్న తెలంగాణ డ్రోన్ల పైలట్లకు శిక్షణనివ్వడంపై దృష్టిపెట్టింది. ఈ క్రమంలోనే తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ(టీఎస్ఏఏ) డ్రోన్ పైలట్ల శిక్షణకు ఓ ప్రైవేటు కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా రానున్న రోజుల్లో డ్రోన్ ఆపరేటర్లకు విస్తృతంగా శిక్షణనివ్వనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. తెలంగాణలో ఇప్పటికే డ్రోన్ల ద్వారా సుదూర ప్రాంతాల్లోని పీహెచ్సీ ఆస్పత్రులకు మందులు సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..