హైదరాబాద్ – రేపు, ఎల్లుండి పలు ప్రాంతాల్లో నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది. 9, 10 తేదీలలో నీటి సరఫరా ఉండదని పేర్కొంది. ఉస్మాన్ సాగర్, హకీంపేట ప్రాంతాల మధ్య జరుగుతోన్న నీటిపైపుల మరమ్మతుల కారణంగా 9వ తేదీన ఉదయం 6 గంటల నుంచి మార్చి 10 మధ్యాహ్నం 12 గంటల వరకు వివిధ ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోతుందని తెలిపింది.
నీటి సరఫరా ఉండని ప్రాంతాలు ..
విజయనగర్ కాలనీ, హుమాయూన్ నగర్, కాకతీయ నగర్, సయ్యద్ నగర్, ఎంఈఎస్ ప్రాంతాలు, ఏసీ గార్డ్స్, రెడ్ హిల్స్, ఇన్‌కమ్ టాక్స్ ఏరియా, సచివాలయం, సీఐబీ క్వార్టర్స్, ఇందిరా నగర్, బీజేఆర్ కాలనీ, అడ్వొకేట్ కాలనీ, హిల్ కాలనీ, గోకుల్ నగర్, నాంపల్లి రైల్వే స్టేషన్, జంగం బస్తీ, అసెంబ్లీ, ఖైరతాబాద్, మల్లేపల్లి, లక్డీకాపూల్, సీతారాంబాగ్, గన్ ఫౌండ్రీ, చిరాగ్ అలీ లేన్, అబిడ్స్, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్, బీఆర్కే భవన్, బిర్లా మందిర్, హిందీ నగర్, ఘోడే కాబ్ర్, దోమలగూడ, గాంధీనగర్, ఎమ్మెల్యే కాలనీ, తట్టిఖానా, ఎన్బీటీ నగర్, నూర్ నగర్ తదితర ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోతుందని తెలిపింది.